ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం నటించిన ఆఖరి సినిమా.. బాలీవుడ్ అగ్ర హీరో చేతుల్లోకి..
గాన గంధర్వుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణించి అప్పుడే రెండు నెలలు గడిచిపోయాయి. అయితే కలలో కూడా ఇంకా ఆయన మరణవార్త నిజమని నమ్మడానికి వీలుపడటం లేదు. ఎన్నో పాటలతో మనుషుల జీవితాలకు ఎంతగానో దగ్గరైన బాలు తెలుగు వారు అవ్వడం నిజంగా ఒక అదృష్టమని చెప్పాలి. ఇక ఆయన నటుడిగా ఎన్నోసార్లు సక్సెస్ అయ్యారు. ఇక బాలు ఫుల్ లెన్త్ పాత్రలో నటించిన ఆఖరి సినిమా ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు మిథునం.

ఎస్పీబీ స్థాయిని పెంచిన సినిమా
ఎస్పీ.బాల సుబ్రహ్మణ్యం సింగర్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా అవకాశం వస్తే నటుడిగా కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎక్కువగా తండ్రి పాత్రలో కనిపించారు. దాదాపు వందకి పైగా సినిమాల్లో నటించారు. ఇక ఆయన కెరీర్ మొత్తంలో నటుడిగా స్థాయిని పెంచిన చిత్రం మిథునం. ఆ సినిమాలో రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి. ఎస్పీబీతో పాటు సీనియర్ నటి లక్ష్మీ.. భార్య పాత్రలో అద్భుతంగా నటించింది.

కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికి..
వయసు పై బడిన వృద్ధ దంపతులు. కుటుంబాలకు ధూరంగా ఒక సాదరణమైన జీవితం గడపడమే ఆ సినిమా అసలు కథ. సినిమాలో ప్రేమ ఆప్యాయతలు అలాగే ఆ వయస్సులో వారు చిన్నపిల్లలే అన్నట్లుగా చూపించారు. నటుడు తనికెళ్ళ భరణి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాకపోయినప్పటికి తెలుగు సినిమాల్లో మిథునం ఒక ఆణిముత్యం అని చెప్పిన అగ్రతారాలు ఎంతో మంది ఉన్నారు.

హిందీలో అమితాబ్ బచ్చన్..
అసలు విషయంలోకి వస్తే ఇప్పుడు మిథునం సినిమా రీమేక్ పై చర్చలు మొదలైనట్లు మరొక టాక్ వైరల్ గా మారింది. బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ హిందీలో చేసే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సినిమాలో మంచి ఫీల్ గుడ్ ఎమోషన్ ఉందని అమితాబ్ బచ్చన్ లాంటి యాక్టర్ చేస్తే బావుంటుందని ఒక బడా నిర్మాణ సంస్థ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
Recommended Video

దర్శకుడి కోసం వెతుకుతున్న నిర్మాతలు
బాలసుబ్రహ్మణ్యం మిథునం సినిమాను కేవలం ఒక నటుడిగా తృప్తి పొందడానికే చేశారట. ఇక ఆ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువ. కానీ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటుడు అలాంటి కథను చేస్తున్నారు అంటే సాహసమనే చెప్పాలి. ఇక సినిమాలో ఎమోషన్ ని మిస్ అవ్వకుండా తెరకెక్కించే దర్శకుడు దొరికితే వెంటనే సినిమాపై క్లారిటీ ఇవ్వాలని ఒక బాలీవుడ్ సంస్థ ఆలోచిస్తున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











