హాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న శ్రీదేవి కూతురు
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తోంది. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ అందుకోకపోయినా కూడా జాన్వీ తన టాలెంట్ తో అవకాశాలు బాగానే అందుకుంటోంది.రొటీన్ గా కాకుండా వినూత్నమైన సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఆడియెన్స్ ను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సెనా సినిమా నుంచి జాన్వీకి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ డిఫెరెంట్ సినిమాలను లైన్ లో పెడుతోంది.
అదే విధంగా హాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతోంది. ఇటీవల కొన్ని హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన ఆడిషన్స్ లో కూడా పాల్గొన్నట్లు చెప్పింది. కేవలం ఒక భాషకు అంకితం కాకుండా వరల్డ్ వైడ్ గా అన్ని రకాల సినిమాలను చేయాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది. ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ రూహి అనే హారర్ మూవీ చేసింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది.

పెళ్లి అనగానే అవహించే దెయ్యం వెనుక ఉన్న అసలు కథ ఏమిటనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని క్లారిటీ వచ్చేసింది. ఇందులో జాన్వీ ఒక సాధారణ అమ్మాయిలనే కాకుండా భయంకరమైన దెయ్యంగా కనిపిస్తోంది. కామెడీ ప్లస్ హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్, వరుణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక స్త్రీ సినిమాతో గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న నిర్మాత ఈ సినిమాను నిర్మించగా రైటర్ కం డైరెక్టర్ హార్దిక్ మెహతా దర్శకత్వం వహించాడు. మార్చ్ 11న రూహి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











