యంగ్ హీరోతో జాహ్నవి కపూర్ రొమాన్స్.. కరణ్ జోహార్ సెట్ చేశాడంటూ ప్రచారం
అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. తొలి సినిమా 'దడక్'తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరోయిన్.. ప్రస్తుతం మరికొన్ని సినిమాలు చేస్తోంది. తల్లి బతికున్నప్పుడే తన వ్యవహార శైలితో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది. ఇప్పుడు ఆ సినిమా షూటింగులో పాల్గొంటోంది.
జాహ్నవి కపూర్ ప్రస్తుతం 'రూహీ అఫ్జా' అనే సినిమా చేస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో పాటు మరో సినిమా షూటింగ్‌లోనూ ఆమె పాల్గొంటోంది.

అదే.. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా తెరకెక్కిస్తున్న 'దోస్తానా 2'. 2008లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'దోస్తానా'కు ఇది కొనసాగింపు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యతో పాటు సీనియర్ నటి టబు అక్క కుమారుడు ఫతే రాంధవ కూడా అవకాశం దక్కించుకున్నాడు. సక్సెస్‌ఫుల్ సినిమాకు సీక్వెల్ కావడంతో దీనిపై బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ చిత్రాలు ఒక పక్క నడుస్తుండగానే.. కరణ్ జోహార్ త్వరలోనే నిర్మించబోయే సినిమాకు జాహ్నవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. ఈ సినిమాను 'సైతాన్' ఫేమ్ నంబియర్ తెరకెక్కించనున్నాడని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఇందులో 'దడక్' హీరో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించనున్నాడని తెలిసింది. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ద్వారా 'దడక్' జంట మరోసారి రొమాన్స్ చేయనుందన్న మాట.


Click it and Unblock the Notifications











