మీ అమ్మ శ్రీదేవి లేకపోవడమే మంచిదైంది.. ట్రోలింగ్ పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
శ్రీదేవి వారసురలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఒక స్టార్ హీరోయిన్ గా ఎదగడం కన్నా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన గుంజన్ సక్సెనా బయోపిక్ అందుకు ఉదాహరణగా నిలిచింది. అయితే జాన్వీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆమె ఎంత కష్టపడినా కూడా ఓ వర్గం నుంచి ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు. ఇక ఇటీవల ఆమె తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ గురించి వివరణ ఇచ్చింది.

మా అమ్మను కూడా..
ప్రస్తుతం నెపోటిజమ్ డోస్ ఎక్కువవుతున్న తరుణంలో విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో జాన్వీ కపూర్ కూడా ఉంది. అయితే ఇంకా ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి రాలేదు కాబట్టి ఎక్కువ ఫోకస్ పడలేదు. కానీ ఆమె నిత్యం ఎదో ఒక సందర్భంలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. ఆఖరికి విమర్శలు చేస్తున్నప్పుడు తన తల్లిని కూడా లాగుతున్నారని ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది.

ట్రోలింగ్ నాకు కొత్తేమి కాదు
జాన్వీ మాట్లాడుతూ.. ట్రోలింగ్ నాకు కొత్తేమి కాదు. నేను చేసిన మొదటి సినిమా నుంచే నాపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అలాగే పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. కానీ నేను ట్రోలింగ్ గురించి ఎక్కువగా ఆలోచించను. నేను నా పనికి ఎంతవరకు న్యాయం చేశాను. ఇంకా ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా అని విషయంపై ఎక్కువగా దృష్టి పెడతాను.

మీ అమ్మ లేకపోవడమే మంచిదని
ట్రోలింగ్స్ విషయానికి వస్తే ఒక సమయంలో దారుణమైన కామెంట్స్ ఎదురయ్యాయి. నీ నటనను చూసేందుకు ఇప్పుడు మీ అమ్మ లేకపోవడమే మంచిది అయ్యిందని కూడా అన్నారు. నిజంగా అలాంటి మాట చాలా బాధని కలిగిస్తుంది. కానీ నేను సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ గురించి ఎక్కువగా పట్టించుకోను. ట్రోల్ చేసే వారికి ఎదుటివారి ఆలోచన విధానం ఏ మాత్రం తెలియదని అర్ధమయ్యింది.
Recommended Video

నెపోటిజమ్ పై కామెంట్స్..
దడక్ సినిమా నుంచి కూడా ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా వాటిని పట్టించుకుంటే అర్థం ఉండదు. ఇక నెపోటిజమ్ విమర్శలు చేసే వారి గురించి మాట్లాడలేను. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ సినిమా ఇండస్ట్రీలో జనాలు ఆదరిస్తేనే ఎవరైనా సరే నిలదొక్కుకుంటారు. ఎంత పెద్ద స్టార్ వారసులు అయినా సరే మంచి ప్రతిభతో మొదట అభిమానులను ఆకట్టుకుంటేనే అవకాశాలు అందుకుంటారని జాన్వీ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











