శ్రీదేవి ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మళ్ళీ అతని చేతుల్లోనే..
అతిలోకసుందరి వారసురాలిగా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ మంచి అవకాశాలను అందుకుంటోంది. ఆమె చేస్తున్న సినిమాలు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోయినప్పటికి నటనతో మాత్రం మంచి ఛాన్సులు దక్కించుకుంటోంది. జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సీనియర్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక ఆ తరువాత వచ్చిన గుంజన్ సక్సెనా బయోపిక్ ద కార్గిల్ గర్ల్ పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక జాన్వీ తరువాత శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా త్వరలోనే వెండితెరపై హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకోబోతొంది.

కరణ్ జోహార్ ద్వారానే ఖుషి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది.ఒక కొత్త డైరెక్టర్ తో లవ్ స్టోరీని సిద్ధం చేయించిన నిర్మాత కరణ్ జోహార్ ఖుషి కపూర్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసేశాడట. గత ఏడాది నుంచి కూడా ఈ బ్యూటీ ఎంట్రీ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
ఇక మొత్తానికి ఇప్పుడు ఒక కథనైతే ఫిక్స్ చేశారు. ఖుషి కపూర్ కు బయట ప్రొడక్షన్ ల నుంచి ఆఫర్స్ చాలానే వచ్చాయట. అయితే తండ్రి బోణి కపూర్ మాత్రం కరణ్ జోహార్ మీద నమ్మకంతో ఖుషిని అప్పగించినట్లు తెలుస్తోంది. మరి కరణ్, ఖుషి కపూర్ కెరీర్ ను ఎలా సెట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











