»   »  శ్రీదేవి వైరల్ వీడియో : ఇదే చివరి జ్ఞాపకం, ఫ్యాన్స్ ఉద్వేగం!

శ్రీదేవి వైరల్ వీడియో : ఇదే చివరి జ్ఞాపకం, ఫ్యాన్స్ ఉద్వేగం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
శ్రీదేవి వైరల్ వీడియో : ఇదే చివరి జ్ఞాపకం, ఫ్యాన్స్ ఉద్వేగం!

అతిలోక సుందరి శ్రీదేవి మరణాన్ని అభిమాన లోకం జీర్ణించుకోలేక పోతోంది. దుబాయ్‌లో శనివారం రాత్రి ఆమె కన్ను మూసిందనే విషయం తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ అంతా విషాదంలో మునిగిపోయారు. శ్రీదేవిది సహజ మరణం కాదని, అనేక అనుమానాలు ఉన్నాయంటూ పలు రిపోర్ట్స్ బయటకు రావడం, భారత మీడియాలో ఆమె మరణంపై పలు సంచలన కథనాలు అల్లడం, సుబ్రహ్మణ్య స్వామి లాంటి రాజకీయ నేతలు ఆమె హత్య చేయబడింది అంటూ వ్యాఖ్యలు చేస్తుండటంతో...... అభిమానుల్లో ఆందోళన మరింత తీవ్రం అయింది.

శ్రీదేవి చివరి క్షణాలు

శ్రీదేవి చివరి క్షణాలు

బోనీ కపూర్ మేనల్లుడి వివాహ వేడుక కోసం తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.... అక్కడి హోటల్‌లో అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. మరణానికి ముందు శ్రీదేవి అక్కడి వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడిపారు.

శ్రీదేవి డాన్స్ వీడియో వైరల్

శ్రీదేవి డాన్స్ వీడియో వైరల్

తన బంధువు మోహిత్ మార్వా పెళ్లి వేడుకలో శ్రీదేవి నృత్యం చేశారు. తన సహ నటుడు, మరిది అయిన అనిల్ కపూర్‌తో కలిసి పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చివరి డాన్స్ అదే పాటకు

బోనీ కపూర్‌తో పెళ్లికి ముందు శ్రీదేవి అనేక సినిమాల్లో నటించారు. ఆమె కేవలం అద్భుతమైన నటి మాత్రమే కాదు, సూపర్బ్ డాన్సర్ కూడా. భారతీయ సినీ అభిమానులు ఆమెకు నీరాజనం పట్టడానికి కారణం ఆమె అందం, నటన, డాన్స్ టాలెంటే. శ్రీదేవి చివరి సారిగా మోహిత్ మార్వా పెళ్లి వేడుకలో ‘చిట్టియాన కలైయాన్' అనే పాటకు డాన్స్ చేశారు.

 శ్రీదేవి-అనిల్

శ్రీదేవి-అనిల్

శ్రీదేవి, అనిల్ కపూర్ అప్పట్లో ఆన్ స్క్రీన్ సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి దాదాపు 12 హిందీ సినిమాల్లో నటించారు. లాడ్లా, జుదాయి, మిస్టర్ ఇండియా, లమ్హే, రూప్ కి రాణి చోరోంకా రాజా, రామ్ అవతార్, సోనె పె సుహాగా, జోషిలాయ్ చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించారు.

 మంగళవారం సాయంత్రానికి ఇండియాకు శ్రీదేవి డెడ్ బాడీ

మంగళవారం సాయంత్రానికి ఇండియాకు శ్రీదేవి డెడ్ బాడీ

కాగా... శ్రీదేవి మరణం మిస్టరీగా ఉండటంతో పూర్తి విచారణ అనంతరం దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం సాయంత్రం శ్రీదేవి డెడ్ బాడీ ముంబై చేరనుంది. ఈ రోజు సాయంత్రం లేదా బుధవారం ఉదయం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

English summary
A video of Sridevi dancing with her brother-in-law Anil Kapoor, who was also her most popular on-screen hero, at Mohit Marwah's wedding in Dubai has gone viral. Sridevi can be seen dancing to Bollywood number 'Chittiyan Kalaiyaan' with Anil Kapoor, looking happy and radiant as ever.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu