శ్రీదేవి తొలి వర్ధంతి: అమ్మా... నీవు లేవని గుర్తొస్తే హృదయం ముక్కలు.. జాహ్నవి ఎమోషనల్
అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మృతి సినీ జగత్తు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శ్రీదేవి ఇక లేరనే వార్త నుంచి తేరుకోవడానికి అభిమానులకు చాలా కాలమే పట్టింది. శ్రీదేవి మరణంతో కాలం భారంగా సాగుతూ ఏడాది గడిచిపోయింది. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని హోటల్‌లోని బాత్ టబ్‌లో శ్రీదేవి అనుమానాస్పద రితీలో మరణించడం ప్రతీ ఒక్కరిని షాక్ గురిచేసింది. తాజాగా శ్రీదేవి తొలి వర్ధంతిని పురస్కరించుకొని కూతురు జాహ్నవి కపూర్ ఉద్వేగానికి లోనైంది. ఇన్స్‌టాగ్రామ్‌లో జాహ్నవి ఏమని స్పందించారంటే..

ఇంకా షాక్‌లోనే ఉన్నా
శ్రీదేవి మరణం తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. దానిని నా హృదయం నుంచి ఏదీ కూడా చెడిపేయలేదు. నాలుగైదు నెలలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థి ఉండేది అని జాహ్నవి ఆవేదన గురయ్యారు.

శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా
శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా తన తల్లి చేతిలో చేతి వేసి ఉన్న పాత ఫొటోను జాహ్నవి షేర్ చేసింది. నీవు లేవని గుర్తొస్తే హృదయం భారంగా ఉంటుంది. కానీ నేనెప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తాను. ఎందుకంటే అందులో నీవు ఉంటావు కనుక అని జాహ్నవి ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

లవ్ యూ స్వీటి అంటూ
జాహ్నవి కపూర్ చేసిన పోస్టుకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. తన సోదరి సోనమ్ కపూర్ స్పందిస్తూ.. లవ్ యూ స్వీటి అంటూ కామెంట్ చేసింది. అలాగే కరణ్ జోహర్ కూడా లవ్ యూ జాహ్నవి, కుషీ, బోని కపూర్ అంటూ కామెంట్ చేశారు. ఇలా అభిమానులు కూడా భారమైన గుండెతో జాహ్నవి పోస్టుకు స్పందిస్తున్నారు.

చెన్నైలో పూజలు
శ్రీదేవి ప్రథమ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 14న చెన్నైలో ఓ పూజా కార్యక్రమాన్ని బోనికపూర్ కుటుంబం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అజిత్ ఫ్యామిలీతోపాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ఆద్యంతం భావోద్వేగంతో నిండింది.


Click it and Unblock the Notifications











