మరణానంతరం శ్రీదేవి తొలి పెళ్లిరోజు: కన్నీరు తెప్పిస్తున్న జాహ్నవి, బోనీ ట్వీట్!
అభిమానులను, కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టివేస్తూ ప్రముఖ నటి శ్రీదేవి ఫిబ్రవరి 22, 2018లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణించి నెలలు గడిచినా ఆ కన్నీటి జ్ఞాపకాల నుండి ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా బయటకు రాలేదు. జూన్ 2న శ్రీదేవి, బోనీ కపూర్ పెళ్లి రోజు. శ్రీదేవి మరణం తర్వాత వచ్చిన తొలి పెళ్లిరోజు. భార్యతో అనుబంధాన్ని, గడిపిన క్షణాలను తలుచుకుంటూ బోనీ కపూర్ ట్విట్టర్లో చేసిన పోస్ట్ అందరూ ఎమోషనల్ అయ్యేలా చేసింది.

ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న జాహ్నవి
తన పేరెంట్స్ పెళ్లి రోజు సందర్బంగా.... అమ్మతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జాహ్నవి కపూర్ ఈ అందమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
భార్య జ్ఞాపకాలతో బోనీ కపూర్ ట్వీట్
శ్రీదేవి మరణానంతరం ఆమె ట్విట్టర్ ఖాతాను బోనీ కపూర్ హ్యాండిల్ చేస్తున్నారు. తమ పెళ్లి రోజు సందర్భంగా భార్యను తలుచుకుంటూ బోనీ కపూర్ చేసిన ట్వీట్ అభిమానులను కన్నీరు పెట్టించింది. దుబాయ్‌లో జరిగిన పెళ్లి వేడుకలో శ్రీదేవి గడిపిన చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు.

ఆ లోటును అనుభవిస్తున్న జాహ్నవి
ఏ హీరోయిన్‌కు అయినా సినిమా రంగంలో అడుగు పెడుతున్న సమయంలో తల్లి సపోర్ట్ ఎంతో అవసరం. కూతురును హీరోయిన్‌గా చూడాలని కలలుకన్న శ్రీదేవి తన ముద్దుల తనయ జానును తెరపై చూసుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. తల్లి జ్ఞాపకాలతో, ఆమె ఇచ్చిన ఇన్స్‌స్పిరేషన్ జాహ్నవి ధైర్యంగా ముందుకు సాగుతోంది. గత వారం జాహ్నవి తల్లిదండ్రులకు సంబంధించిన ఓ పెయింట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

1984లో శ్రీదేవి జీవితంలోకి బోనీ
గతంలో ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ... 1984లో బోనీ కపూర్ తన జీవితంలో ప్రవేశించాడని, మిస్టర్ ఇండియా సినిమాలో సీమా అనే పాత్ర కోసం తొలిసారి తనను సంప్రదించాడని, ఆ తర్వాత తమ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని వెల్లడించారు.

బోనీ ప్రేమను అంగీకరించడానికి
బోనీ కపూర్ ప్రేమను అంగీకరించడానికి శ్రీదేవి చాలా సమయం తీసుకుంది. 1993లో తొలిసారి శ్రీదేవికి బోనీ కపూర్ ప్రపోజ్ చేశాడు. అతడి ప్రేమను అంగీకరించడానికి శ్రీదేవి చాలా సమయం తీసుకుంది. చివరకు 1996లో వీరి వివాహం జరిగింది.

శ్రీదేవి నిర్ణయంపై అంతా షాక్
బోనీ కపూర్‌ను వివాహం చేసుకోవాలని శ్రీదేవి తీసుకున్న నిర్ణయం ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను షాక్ కు గురి చేసింది. బోనీకి అప్పటికీ పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ విషయంలో తాను ఎవరి మాట పట్టించుకోదలుచుకోలేదని, తన మనసు చెప్పినట్లు చేశాను అని శ్రీదేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


Click it and Unblock the Notifications











