twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి జ్ఞాపకం అందరికీ అందించడమే లక్ష్యంగా చైనా‌లో 'మామ్'

    |

    ఇండియన్ సినిమా లెజెండ్, అతిలోక సుందరి శ్రీదేవి చివరగా నటించిన చిత్రం 'మామ్'. రివెంజ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తన అద్భుతన నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డ్ దక్కింది. నటిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో శ్రీదేవి నటించిన 300వ చిత్రం ఇది.

    ఈ చిత్రాన్ని రెండేళ్ల క్రితం ఇండియాతో పాటు 39 దేశాల్లో విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్' వారు'మామ్' చిత్రాన్ని ఇప్పుడు చైనా భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు చైనాలో మార్చ్ 22‌న రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

    Sridevis MOM all set to release in China on 22nd March 2019

    ఈ సందర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.. ప్రాంతాలకు అతీతంగా ప్రతి తల్లి, ప్రేక్షకుడిని కదిలించే చిత్రం 'మామ్'. శ్రీదేవి చివరగా నటించిన ఈ చిత్రాన్ని తన జ్ఞాపకంగా అందరికీ అందించాలన్నదే మా లక్ష్యం. జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వారు మొదటి నుండి మాకు తోడుగా ఉన్నారు. రిలీజైన రెండేళ్ల తర్వాత కూడా వారు ఈ చిత్రాన్ని ప్రపంచ నలుమూలలకీ తీసుకెళ్లడం ఆనందంగా ఉందన్నారు.

    శ్రీదేవి అద్భుతమైన నటి. ఆవిడ పోషించిన పాత్రలు మనతో చిరస్థాయిగా ఉండిపోతాయి. అందుకు 'మామ్' ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్కడ విడుదలైనా ఈ చిత్రానికి అద్భుత స్పందన వస్తోంది. ఆమె నటించిన ఈ హార్ట్ టచింగ్ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేయడం గర్వంగా ఉందని జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ హెడ్ విభా చోప్రా తెలిపారు. రవి ఉద్యావర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

    English summary
    Cinema legend Sridevi gave audiences one of the finest performances of her career with the revenge thriller, MOM, that won her a National award.MOM that also won music maestro A R Rahman a National award for Best Background Score,is set to release in China on 22nd March, 2019.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X