శ్రీహరి కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు... అమ్మ, నాన్న గురించి ఎమోషనల్ స్పీచ్!

Recommended Video

Rajdoot Movie Teaser Launch || Filmibeat Telugu

దివంగత నటుడు, రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి తనయుడు మేఘాంశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రాజ్‌దూత్'. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది.

ఈ కార్యక్రమానికి మేఘాంశ్ తల్లి డిస్కోశాంతితో పాటు జీవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ... మేఘాంశ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా రెండు కుటుంబాల మధ్య చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. మేఘాంశ్‌లో మంచి నటుడు అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని తెలిపారు.

శ్రీహరి మన మధ్య లేక పోయినా..

శ్రీహరి మన మధ్య లేక పోయినా..

శ్రీహరిగారు మన మధ్య లేక పోయినా ఆయన్ను తలుచుకోని వారు ఎవరూ లేరు. ఇక్కడ ఎవరూ పర్మినెంటుగా ఉండిపోము. అందరూ వెళ్లిపోవాల్సిన వారమే. కానీ మేఘాంశ్ రూపంలో మళ్లీ ఆయన మన ముందుకు వస్తున్నారని జీవిత వ్యాఖ్యానించారు.

వాళ్ల నాన్న పేరు నిలబెడతాడు

వాళ్ల నాన్న పేరు నిలబెడతాడు

హీరో తల్లి డిస్కో శాంతి మాట్లాడుతూ... ‘‘ మేఘాంశ్ వాళ్ల నాన్న పేరు కాపడతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. మొన్న ఒకసారి పిల్లలంతా పైన డాన్స్ చేస్తుంటే దొంగతనంగా వెళ్లి చూశాను. వాళ్ల అమ్మ గ్రేస్ వాడి బాడీలో ఉంది. అది బై బ్లడ్ వచ్చేస్తుంది.'' అన్నారు.

మా బావ ఫ్యాన్స్ ఆశీర్వాదం కావాలి

మా బావ ఫ్యాన్స్ ఆశీర్వాదం కావాలి

మా బావ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. మేము మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా బావని మీరు ఎలా ఆదరించారో... నా కొడుకును కూడా అలాగే ఆదరించాలని మీ చేతిలో పెడుతున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ అలాగే ఉండాలి. తను ఎప్పుడూ మీ ఇంటి బిడ్డలానే ఉంటాడు...హీరోలా ఎప్పుడూ బిహేవ్ చేయడు... అని డిస్కో శాంతి తెలిపారు.

వాళ్లు లేకుండా నేను లేను: మేఘాంశ్ ఎమోషనల్

వాళ్లు లేకుండా నేను లేను: మేఘాంశ్ ఎమోషనల్

మేఘాంశ్ మాట్లాడుతూ... ‘ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్. ‘రాజ్ దూత్' నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన సత్తిబాబు అంకుల్‌కు థాంక్స్. డైరెక్టర్స్ అర్జున్ అండ్ కార్తీక్ చాలా బాగా చేశారు. హీరోయిన్ నక్షత్ర తెలుగు అమ్మాయి కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సినిమా గురించి చెప్పడం కంటే చూస్తేనే బావుంటుంది. నేను ఇక్కడి వరకు రావడానికి కారణం మా ఫాదర్, మదర్. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. వాళ్లు లేక పోతే నేను లేను. వచ్చే నెల సినిమా విడుదలవుతుంది'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X