నిజ జీవితంలో నటించకు, మీ మనవరాలిని చూసైనా.. సెక్స్ వేధింపులపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!
Recommended Video

శ్రీరెడ్డి వివాదాస్పద కామెంట్స్ తాజాగా బాలీవుడ్ ని కూడా తాకాయి. ఏకంగా అమితాబ్, అమిర్ ఖాన్ వంటి టాప్ స్టార్స్ పైనే శ్రీరెడ్డి విరుచుకుపడింది. తనుశ్రీ దత్త, నానా పాటేకర్ విషయంలో బాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తనుశ్రీ దత్తపై లైంగిక వేధింపుల గురించి అమితాబ్, అమిర్ ఖాన్ స్పందించిన తీరు షాకింగ్ గా ఉందని తెలిపింది.

అమితాబ్, అమిర్ ఖాన్ స్పందన
తనుశ్రీ దత్తపై నానా పాటేకర్ లైంగిక వేధింపుల విషయం తీవ్రమైన చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మీడియా నుంచి ఈ వ్యవహారంపై అమితాబ్ కు ప్రశ్న ఎదురైంది. దీని గురించి మాట్లాడడానికి నేను నానా పాటేకర్ ని కాదు.. తనుశ్రీదత్తాని కూడా కాదు అని అన్నారు. అమిర్ ఖాన్ మాట్లాడుతూ వాస్తవాలు తెలియకుండా నేను మాట్లాడానని తెలిపాడు.

ఇలాంటి స్పందన
తనుశ్రీదత్తాపై అమితాబ్, అమిర్ ఖాన్ స్పందన చూసి శ్రీరెడ్డి భగ్గుమంటోంది. మీ నుంచి ఇలాంటి స్పందన అసలు ఊహించలేదని శ్రీరెడ్డి తెలిపింది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పేరుతో మీడియాలో పబ్లిసిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగు, తమిళ సినీ ప్రముఖులపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ ని టార్గెట్ చేసింది.

మీ మనవరాలిని చూసైనా
అమితాబ్ బచ్చన్ గారు మీకు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారిని చూసైనా సరిగా మాట్లాడాలని అనిపించలేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా అంటూ తీవ్రమైన మాటలతో విరుచుకుపడింది.

నిజజీవితంలో నటించకు
మీకు ఆడవాళ్లపై గౌరవం లేకుంటే.. వివిధ యాడ్స్ లో నటిస్తూ,నీతి సూక్తులు చెప్పడానికి ఏమాత్రం అర్హులు కాదు. శ్రీరెడ్డి బాలీవుడ్ మెగాస్టార్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారేలా ఉంది. అమీర్ ఖాన్ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి వింత స్పందన నీ నుంచి ఊహించలేదు.. నిజజీవితంలో నటించకు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

పెనుదుమారంగా
నానా పాటేకర్ పై తనుశ్రీ దత్త లైంగిక ఆరోపణలు పెను దుమారంగా మారాయి. ఈ వ్యవహారంలో చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు తనుశ్రీ దత్తకు మద్దత్తుగా నిలిస్తున్నారు. అమితాబ్, అమీర్ వంటి టాప్ స్టార్స్ మాత్రం న్యూట్రల్ గా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











