షారుక్ ఖాన్ ఇంట్లో ముగిసిన గణపతి వేడుక
గణేష్ చతుర్థి సందర్భంగా బాలీవుడ్ మొత్తం కొన్ని రోజులుగా గణపతి ఉత్సవాల్లో బిజీ బిజీగా గడిపింది. బప్పాను ఇంటికి తీసుకు వచ్చిన పలువురు సెలబ్రిటీలు గురువారం వీడ్కోలు పలికారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కూడా తన చిన్న కుమారుడు అబ్ రామ్‌తో గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు.
తమ ఇంట్లో జరిగిన గణపతి వేడుకలకు సంబంధించి ఫోటోలను పంచుకుంటూ షారూఖ్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కొన్ని పోస్టులు చేశారు. అందులో ఒక చిత్రంలో... అబ్‌రామ్ గణపతి బప్పా ఆశీర్వాదం తీసుకుంటూ కనిపించాడు.

ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు షారుఖ్ ఖాన్ ఇలా పేర్కొన్నారు. "పూజ పూర్తయింది.... విసర్జన్ కార్యక్రమం వైభవంగా జరిగింది. గణపతి బప్పా మోరియా !! ప్రతి ఇంటిలోనూ, ప్రతి కుటుంబంలోనూ ఆనందం వెల్లువిరియాలి" అంటూ ట్వీట్ చేశారు.
గణేష్ చతుర్థి వేడుకలు కింగ్ ఖాన్ ఇంట్లో ప్రతిఏటా క్రమం తప్పకుండా జరుగుతాయి. ప్రతి సంవత్సరం, షారుఖ్ గణేశుడిని ఇంటికి తీసుకువచ్చి, అన్ని ఆచారాలతో వీడ్కోలు పలుకుతారు. గత సంవత్సరం కూడా ఇలాగే షారుక్ ఖాన్ గణేష్ చతుర్థి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











