క్వారంటైన్‌కు షారుక్ ఖాన్ నాలుగు అంతస్థులు భవనం.. మరోసారి మానవత్వం చాటుకొన్న బాద్షా
కరోనా మహమ్మారిపై పోరాటంలో మేము సైతం అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ స్టార్స్ అందరూ మమేకమయ్యారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సైతం... తమ మీర్ ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రా, పశ్చిమ బంగాల్ ప్రభుత్వాలకు 50వేల పీపీఈ కిట్లు అందజేయనున్నట్లు ప్రకటించాడు. తమకు సంబంధించిన నాలుగు అంతస్తుల భవనాన్ని క్వారంటైన్ కోసం బీఎంసీకి అప్పగించారు. అ
అంతేకాదు... తమ నాలుగంతస్థుల భవనంలో కోవిడ్ 22 మందికి కరోనా బాధితులకు చికిత్స అందించవచ్చునని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన ఫ్యాన్స్ కు మరో పిలుపు ఇచ్చాడు ఈ బాలీవుడ్ బాద్షా.
కింగ్ ఖాన్ కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే...కరోనా నేపథ్యంలో... తన స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తున్న షారుఖ్ కు... అన్ని వైపుల నుంచి తమ సంస్థతో కలసి పనిచేయాలన్న విన్నపాలు వెల్లువెత్తుతున్నాయట. కానీ, దాతల నుంచి ఎలాంటి సహాయం స్వీకరించకూడదన్న నియమంతో ఇన్నాళ్లూ మిన్నకుండిపోయిన షారుఖ్... తాజా పరిస్థితి నేపథ్యంలో ఆ నిబంధనలను కాస్త సడలించినట్లు తెలుస్తోంది.

మీర్ ఫౌండేషన్ విడుదల చేసిన వీడియోలో... షారుఖ్.. తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ పరిస్థితుల్లో అందరూ ఒక్కతాటి పైకి వచ్చి చేతులు కలపాల్సిందిగా కోరాడు. ముఖ్యంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్న ఆరోగ్య సిబ్బందికి వెన్నుదన్నుగా నిలవాల్సిన సమయమిదని వ్యాఖ్యానించాడు.
Recommended Video
వీలైనంతగా... ఆరోగ్య సిబ్బందికి పీపీఈ కిట్లు అందజేయాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు. ప్రజారోగ్యాన్ని రక్షించే సైనికులుగా కరోనాతో పోరాడుతున్న వైద్యులు, పరిశోధకులు, ఇతర ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ అని తెలిపాడు. ఇక మరొక ట్వీట్ లో ... మీర్ ఫౌండేషన్ తో చేతులు కలిపి... ఆరోగ్య సంరక్షకులను అండగా నిలబడాల్సిందిగా అభ్యర్థించాడు కింగ్ ఖాన్.


Click it and Unblock the Notifications











