సుశాంత్ జీవితంలో మధుర జ్ఞాపకాలు.. వీడియో షేర్ చేసిన సోదరి శ్వేతా సింగ్
రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి, కానీ, సుశాంత్ మరణం చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఇక అతడి కుటుంబం, ఈ బాధ నుంచి ఇప్పట్లో కోలుకుంటుందా అంటే, చెప్పడమూ కష్టమే. ఓ వైపు తమ్ముడి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని పోరాడుతున్న శ్వేతా సింగ్, మరోవైపు సోదరుడిని మరచిపోలేక, అతడు మిగిల్చిన జ్ఞాపకాలను పంచుకంటోంది.
సుశాంత్ మరణం గురించిన వాస్తవాలతో పాటూ, అతడి గురించిన విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటోన్న శ్వేతా, తాజాగా తమ్ముడి గురించి షేర్ చేసిన ఓ పాట, అభిమానులను మరోసారి కంటతడిపెట్టిస్తోంది. సుశాంత్ జీవితంలో చోటు చేసుకున్న చిన్ని చిన్ని ఘటనల సమాహారంగా రూపొందిన ఈ పాట, అతడు లేని వెలితిని గుర్తుచేస్తోంది.

సుశాంత్ తన పెంపుడు కుక్కతో ఆడుకోవడం, పాటలు వినడం, చిత్రకళలో మమేకమవ్వడం, నక్షత్రాలను పరిశీలించడం, తన ఇష్టమైన సబ్జెక్ట్ ఫిజిక్స్ తో కుస్తీ పడటం వంటి వివిధ క్లిప్పింగ్ లు, మనం ఎంతటి మేధవిని, ఎంతటి మానవతా మూర్తిని కోల్పోయాము అన్న విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ఏమైనా.. నేలరాలిన ఈ ధృవతార మరోచోట పురుడుపోసుకుంటుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











