Jigra: టాలీవుడ్ పై కన్నేసిన ఆలియా.. సందీప్ రెడ్డి, రణబీర్ దారిలోనే!

సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా వరకు స్టార్ కపుల్స్ ని మనం చూస్తూనే ఉంటాం. కాగా కొందరు హీరోయిన్స్ దర్శకులు కానీ లేదా హీరోలని కానీ పెళ్లిళ్లు చేసుకోవడం దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీస్ లో కనిపిస్తుంది. కాగా రీసెంట్ కోలీవుడ్ నుంచి సిద్ధార్థ్ అలాగే హీరోయిన్ అదితి రావు హైదరిలు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.

ఇక అలాగే మన తెలుగు సినిమా కూడా కూడా కొందరు హీరో హీరోయిన్స్ లో కూడా పెళ్లి చేసుకున్న వారూ ఉన్నారు అలానే విడిపోయిన వారు కూడా ఉన్నారు. కాగా ఈ లిస్ట్ అయితే బాలీవుడ్ సినిమా దగ్గర మాత్రం కొంచెం ఎక్కువే కనిపిస్తుంది. అలా బాలీవుడ్ లో ఉన్నటువంటి ఓ స్టార్ జంటనే తెలుగు సినిమా మార్కెట్ పై బాగా కన్నేసినట్టుగా అర్ధం అవుతుంది.

Star couple ranbir alia bhatt shows special interest on telugu market

మరి ఆ హీరో హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ రన్బీర్ కపూర్ అలాగే తన భార్య ఆలియా భట్ కపూర్ లే.. అయితే వీరిద్దరి కలయికలో వచ్చిన భారీ చిత్రం "బ్రహ్మాస్త్ర" తో తెలుగులో ఒకేసారి కలిసి ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ సినిమా బాగానే రన్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత రన్బీర్ అనిమల్ అనే భారీ సినిమాతో తెలుగులో సోలో ఎంట్రీ ఇచ్చాడు.

మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో చేసిన ఈ సినిమా తెలుగు ప్రత్యేకంగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుని మరీ విడుదల అయ్యి సుమారు 100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం నమోదు చేసింది. కాగా ఈ సినిమాతో రన్బీర్ తెలుగు మార్కెట్ లో దాదాపు సెటిల్ అయ్యిపోయాడు. ఇక ఇపుడు తన భార్య ఆలియా భట్ కూడా తెలుగు మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అని చెప్పాలి.

కాగా ఇందుకు నిదర్శనం ఆలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కేవలం హిందీ సహా తెలుగులో మాత్రమే రిలీజ్ కి ప్లాన్ చేయడం తోనే అని చెప్పొచ్చు. మరి ఆలియా నటించిన ఆ లేటెస్ట్ సినిమానే "జిగ్రా" కాగా ఈ చిత్రంని ఈ దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మొదటగా కేవలం హిందీలో మాత్రమే అనౌన్స్ చేశారు.

Star couple ranbir alia bhatt shows special interest on telugu market

అయితే ఇప్పుడు ఊహించని విధంగా హిందీ సహా తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్టుగా పలు పోస్టర్స్ దర్శనం ఇస్తున్నాయి. మరి ఇతర సౌత్ భాషలు కూడా పక్కన పెట్టి ఆలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం హిందీ తర్వాత ఒక్క తెలుగు భాషలోనే రిలీజ్ చేస్తుండడం ఒకింత మన మార్కెట్ పట్ల ఈ స్టార్ జంట ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే అర్ధం అవుతుంది. మరి రన్బీర్ అయితే ఆల్రెడీ సక్సెస్ అయ్యి చూపించాడు.

ఇప్పుడు తన బాటలోనే వస్తున్న తన భార్య ఆలియా భట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. కాగా ఆలియా నటించిన జిగ్రా తెలుగులో కూడా ఈ అక్టోబర్ 11వ తేదీలోనే థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

More from Filmibeat

Read more about: ranbir kapoor alia bhatt animal 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X