క్రికెటర్‌ కే.ఎల్. రాహుల్ స్టార్ హీరో కూతురు డేటింగ్.. పెళ్లి ఫిక్స్ అయినట్లే?

సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి.. అలాగే పాలిటిక్స్ నుంచి సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. అదే విధంగా క్రికెట్ కూడా ఈ జోన్ లోకి వచ్చేసింది. సెలబ్రెటీ అనే ట్యాగ్ తో చాలా వరకు ఈ జోన్ లో ఉన్నవారికి మంచి రిలేషన్ ఉంటుంది. ఇక యువత అయితే ప్రేమ వార్తలతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. ఇక ఇప్పుడు క్రికెటర్ కె.ఎల్.రాహుల్ తో ఒక స్టార్ హీరో డాటర్ ప్రేమలో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

 క్రికెటర్స్ తో హీరోయిన్స్..

క్రికెటర్స్ తో హీరోయిన్స్..

క్రికెటర్స్, హీరోయిన్స్ కి సంబంధించిన ప్రేమ వార్తలు రావడం కొత్తేమి కాదు. 90ల కాలం నుంచి మన సీనియర్ క్రికెటర్స్ పై కూడా అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక ధోని, యువరాజ్ వంటి స్టార్స్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కూడా గాసిప్స్ చాలానే వచ్చాయి. అయితే చాలా వరకు ఆ ప్రేమలు మధ్యలోనే బ్రేకప్ అయ్యాయి. లైఫ్ లో అదొక భాగమేనని చాలా మంది హీరోయిన్స్ క్రికెటర్స్ తో ఉన్న రిలేషన్స్ పై క్లారిటీ ఇచ్చారు.

విరుష్క జోడి..

విరుష్క జోడి..

ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్నేళ్ల పాటు హీరోయిన్ అనుష్కతో లవ్ ట్రాక్ ని నడిపిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళు ఎవరు ఊహించని విదంగా విడిపోతున్నారు అని రూమర్స్ వస్తున్న సమయంలో పెళ్లి చేసుకొని తమది నిజమైన ప్రేమ అంటూ షాక్ ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ తో ఇద్దరు హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

కుర్ర హీరోయిన్ వలలో రాహుల్..

కుర్ర హీరోయిన్ వలలో రాహుల్..

సీనియర్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కూడా కేఎల్.రాహుల్ తో ప్రేమయణాన్ని కొనసాగిస్తున్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొదట నిధి అగర్వాల్ తో రాహుల్ డేటింగ్ చేస్తున్నట్లు టాక్ వచ్చినప్పటికీ అది నిజం కాదని తెలిసిపోయింది. ఇక ఫైనల్ గా రాహుల్ అతియా శెట్టితోనే డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

Recommended Video

Rajamouli Reveals His Next movie Details After RRR
త్వరలో పెళ్లి?

త్వరలో పెళ్లి?

అతియా శెట్టి ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా బిజీ అవుతోంది. అయితే ఈ తరుణంలో క్రికెటర్ తో లవ్ ట్రాక్ నడిపిస్తున్న ఈ బ్యూటీ వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తోందట. రాహుల్ కూడా ఈ వయసులోనే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇంతవరకు ఈ రూమర్స్ పై ఈ జోడి పెద్దగా స్పందించింది లేదు. మరి ఈ మ్యాటట్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X