twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూడ్ ఫొటో షేర్ చేసిన స్టార్ హీరో భార్య.. పిల్లల ముందు ఇలాంటివి... పరువు పోగొట్టిందంటూ..

    |

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఒకవైపు సినిమాలు హిట్ అవక.. మరోవైపు వ్యాపారాల్లో సత్ఫలితాలు రాక ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. వీటిలో కొన్ని తనే నిర్మించాలని కూడా ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఆయన భార్య గౌరీ ఖాన్ వ్యవహార శైలి షారూఖ్ ఫ్యాన్స్‌ను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి కారణం తాజాగా ఆమె చేసిన పోస్టే.

    సోషల్ మీడియాలో యాక్టివ్

    సోషల్ మీడియాలో యాక్టివ్

    గౌరీ ఖాన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఖాతాల ద్వారా ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలనూ ప్రస్తావిస్తుంది. వీటిని షారూఖ్ అభిమానులు తమ ఫ్యాన్ పేజీలలో షేర్లు చూస్తూ ఉంటారు.

    న్యూడ్ పెయింటింగ్ ఫొటో

    న్యూడ్ పెయింటింగ్ ఫొటో

    తాజాగా గౌరీ ఖాన్ తన ఇంటిలో ఉన్న న్యూడ్ ఫొటో పెయింటింగ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు.. ఓ మహిళను అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అంతేకాదు, వాళ్లు ఆమెను చిత్ర హింసలకు గురి చేసేటట్లు కనిపిస్తోంది. ఈ ఫొటో తమ ఇంటిలోని ఇంటీరియల్ డిజైన్‌ను మరింత అందంగా చూపిస్తుందని గౌరీ ఖాన్ పేర్కొంది.

    ఆ సినిమా 40 సార్లు చూశాను.. షారుక్ ఖాన్ఆ సినిమా 40 సార్లు చూశాను.. షారుక్ ఖాన్

    మొదలైన ట్రోల్స్

    మొదలైన ట్రోల్స్

    గౌరీ ఖాన్ షేర్ చేసిన ఫొటోపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘న్యూడ్ ఫొటోలు షేర్ చేసే ముందు ఒక్కసారి కాదు.. కొన్ని లక్షల సార్లు ఆలోచించాలి' అని ఒకరు సలహా ఇవ్వగా.. ‘ముగ్గురు పిల్లల తల్లివి. వాళ్ల ముందు ఇలాంటి ఫొటోలు పెట్టుకుని ఎలా ఉంటున్నారు..?' అని మరొకరు ప్రశ్నించారు. ఇలా చాలా మంది ఎన్నో రకాలుగా గౌరీ ఖాన్‌ను విమర్శిస్తున్నారు.

    ఫ్యాన్స్ కూడా..

    ఫ్యాన్స్ కూడా..

    బయటి వ్యక్తులే కాదు.. షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ కూడా గౌరీ ఖాన్ చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్‌కు రిప్లైల మీద రిప్లైలు ఇస్తున్నారు. ‘మేడం.. మీ గురించి మాకు తెలుసు.. కానీ, ఇలాంటివి ఊహించలేదు' అని ఒకరంటే.. ‘మీరు చేసిన పని వల్ల షారూఖ్ పరువు గంగలో కలిసిపోయింది' అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు. వీరితో పాటు చాలా మంది అభిమానులు ఈ పోస్టుపై ఆగ్రహంతో ఉన్నారు.

    పోస్ట్ డిలీట్

    పోస్ట్ డిలీట్

    సామాన్యులకు తోడు ఫ్యాన్స్ నుంచే వ్యతిరేకత రావడంతో గౌరీ ఖాన్ తన పోస్టును డిలీట్ చేసేసింది. దీంతో ఫ్యాన్స్ కొంచెం ఊరట చెందారు. అయితే, ఆమె షేర్ చేసిన ఫొటో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది.

    English summary
    Gauri Khan is one such personality to have recently experienced the con of being the wife of the king of Bollywood, Shahrukh Khan. She has become the latest victim of online trolling after she shared a picture of the painting of world-known painter on her Twitter handle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X