ఈ చిన్నారుల అనుబంధాన్ని చూడండి.. ఈ ఫొటోలోని స్టార్ యాక్టర్స్ పిల్లల్ని గుర్తు పట్టారా?
వాళ్లిద్దరూ వరుసకు బావ మరదల్లు.. ఎప్పుడైనా కలిశారంటే ఆడుకుంటుంటారు.. ఎంజాయ్ చేస్తుంటారు. గతంలో ఎన్నో సార్లు వీళ్లిద్దరూ హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా మరోసారి ఈ చిన్నారులిద్దరూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఇంతకీ వీళ్లు ఎవరనేగా మీ సందేహం.. వాళ్లే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ - కరీనా కపూర్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్, కునాల్ - సోహా అలీ ఖాన్ ముద్దులు కూతురు ఇనాయా.
ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. వీరితో పాటే ఆయన సోదరి సోహా అలీఖాన్ దంపతులు కూడా ఈ ట్రిప్‌లో ఉన్నారు. ఇందులో భాగంగానే వీళ్లంతా లండన్‌లో చక్కర్లు కొడుతున్నారు. పెద్దలతో పాటే చిన్నారులు తైమూర్, ఇనాయా కూడా ట్రిప్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సోహా అలీ ఖాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.
సోహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడుకుంటున్న చిన్నారులిద్దరి ఫొటోలను షేర్ చేసి ''ఎన్ని రోజులు అవుతుందో నిన్ను చూసి అనుకుంటూ ఇనాయా.. తైమూర్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అంతేకాదు, అతడిని గట్టిగా హత్తుకుంది. ఈ చిన్నారుల అనుబంధాన్ని చూడండి'' అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ చిన్నారుల ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది సమయంలో ఇవి వైరల్ అయిపోయాయి.

దీంతో ఈ ఫొటోలపై బాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు స్పందిస్తున్నారు. 'పిల్లలు ఎంతో ముద్దుగా ఉన్నారు' అంటూ కొందరు బాలీవుడ్ నటీమణులు కామెంట్ చేయగా, 'వీళ్లది విడదీయరాని బంధం' అంటూ మరికొందరు రిప్లై ఇస్తున్నారు.
ఇప్పుడే కాదు.. గతంలోనూ సోహా వీళ్ల అనుబంధం గురించి తమ అభిమానులతో పంచుకుంది. ఆ సమయంలో ''పసిపిల్లలు ఎంతో బాగా కలిసిపోయారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. వాళ్లు ఆడుకుంటున్నప్పుడు ఇనాయా కొన్నిసార్లు తైమూర్ జుట్టును లాగి ఏడిపిస్తుంటుంది. తైమూర్ భరిస్తాడే తప్ప ఏమీ అనడు. తైమూర్ ఇనాయాను చాలా బాగా చూసుకుంటాడు. బహుశా వాడికి అప్పుడే తెలిసిపోయిందేమో మాది ఒకే కుటుంబమని'' అంటూ సోహా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











