కరోనా సోకిన తరువాత పార్టీలు.. చచ్చిపొమ్మని సలహా ఇచ్చారు.. స్టార్ సింగర్ మనోవేదన

కరోనా వచ్చిన మొదట్లో లాక్ డౌన్ ఏ రేంజ్ లో నడిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే తొలిసారిగా అగ్ర దేశాలు ఎంతో కఠినంగా లాక్ డౌన్ ను ఫాలో అయ్యాయి. ఇక విదేశాల నుంచి రాకపోకలు చాలా వరకు నిలిచిపోగా కొందరు స్వదేశంలో అడుగు పెట్టినప్పుడు పాటించాల్సిన కనీస జాగ్రత్తలు పాటించలేదు. ఆ విషయంలో కొందరు సెలబ్రెటీలు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ప్రముఖ సింగర్ కనికా కపూర్ కూడా అలాంటి విమర్శలు చాలానే ఎదుర్కొన్నారు.

మరోసారి క్లారిటీ ఇచ్చిన కనికా కపూర్

మరోసారి క్లారిటీ ఇచ్చిన కనికా కపూర్

కరోనా వైరస్ కంటే ఎక్కువగా కనికా కపూర్ ఆ తరువాత వచ్చిన విమర్శలతోనే ఎక్కువగా బాధపడ్డారు. మొత్తానికి వైరస్ నుంచి కోలుకున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలు గురించి వివరణ ఇచ్చారు. కరోనా వైరస్ భారిన పడినప్పుడు తన కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు.

కనికాకపూర్ పార్టీలలో పాల్గొనడంతో..

కనికాకపూర్ పార్టీలలో పాల్గొనడంతో..

సాధారణంగా ఎవరైనా బయటిదేశం నుంచి రాగానే క్వారంటైన్ తప్పక ఫాలో అవ్వాలని అప్పట్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కనికా కపూర్ లండన్ నుంచి వచ్చిన తరువాత ముంబై పార్టీలలో పాల్గొనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె పాల్గొన్న రెండు పార్టీలలో మూడు వందల మందికి పైగా జనాలు పాల్గొన్నారు. ఆ విషయంలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

 ఎవరికి పాజిటివ్ రాలేదు..

ఎవరికి పాజిటివ్ రాలేదు..

ఇక ఇంటర్వ్యూలో కనికా ఈ విధంగా స్పందించింది. లండన్ నుంచి రాగానే క్వారంటైన్ గురించి నాకు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. పార్టీలలో పాల్గొన్నాక కొద్దిపాటి లక్షణాలు ఉండగానే పరీక్షలు చేయించుకున్నాను. భయంతో అప్పటికే ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పాను. అసలు దాచిపెట్టలేదు. నాతో పార్టీలో పాల్గొన్న మూడు వందల మందికి టెస్టులు చేయగా ఎవరికి కూడా పాజిటివ్ అని నిర్దారణ కాలేదు.. అని తెలిపింది.

Recommended Video

Interesting Facts About Rekha | Happy Birthday Rekha
చచ్చిపొమ్మని సలహా ఇచ్చారు

చచ్చిపొమ్మని సలహా ఇచ్చారు

ఇక నేను కరోనాతో చికిత్స పాండుతున్నప్పడు కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. నా పిల్లలకు కూడా అసభ్యకరంగా మెస్సేజ్ లు వచ్చాయి. కరోనా గురించి చెప్పకుండా దాచననే అనుమానంతో నన్ను దూషించడమే కాకుండా వెంటనే చచ్చిపోవాలి అంటూ కొందరు ఎంతగానో బాధకు గురి చేశారు. నేనే కాకుండా నా పిల్లలు, నా తల్లిదండ్రులు కూడా ఆ కామెంట్స్ వల్ల ఇబ్బంది పడ్డారని కనికా కపూర్ తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X