స్టేజ్‌పై కుప్పకూలిన స్టార్ సింగర్ .. బెడ్‌పై కదల్లేని స్థితిలో , వీడియో వైరల్

భారతదేశం గర్వించదగ్గ నేపథ్య గాయకుల్లో ఒకరు సోను నిగమ్ కూడా ఒకరు. దాదాపు మూడున్నర దశాబ్ధాలుగా తన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సోను . తన గానం, సంగీతం, నటనతో బిజీగా ఉండే ఆయన.. అప్పుడప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అంతే వార్తల్లో ఉంటారు. ఏ విషయంపై అయినా కుండబద్ధలు మాట్లాడటం ఆయన శైలి. దీంతో పలు వివాదాల్లో సోనూ నిగమ్ ఇరుక్కుంటున్నారు. తాజాగా ఆయనకు పెద్ద కష్టం వచ్చింది.

30 జూలై 1973న హర్యానాలోని ఫరీదాబాద్‌లో జన్మించారు సోనూ నిగమ్. నాలుగేళ్ల వయసులో తండ్రి ఆగం కుమార్ నిగమ్‌తో కలిసి స్టేజ్‌ షోలో పాల్గొని శెభాష్ అనిపించుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లో పాటలు పాడే అవకాశాన్ని అందుకున్న సోనూ నిగమ్.. ప్రముఖ హిందూస్తానీ క్లాసికల్ సింగర్ ఉస్తాద్ గుల్హామ్ ముస్తాఫా ఖాన్ వద్ద శిక్షణ తీసుకున్నారు. 2002లో ఆయన మధురిమ మిశ్రాను పెళ్లాడగా.. ఈ దంపతులకు ఒక కుమారుడు.

star singer sonu nigam suffered severe back pain during live show

భారతీయ భాషలతో పాటు మొత్తం 32 భాషల్లో 6 వేలకు పైగా పాటలు పాడారు సోను నిగమ్. వీటితో పాటు హిందూ, ఇస్లామిక్ ఆధ్యాత్మిక పాటలను కూడా ఆలపించిన ఆయన.. హిందీ, కన్నడ, ఒడియా, పంజాబీ భాషల్లో పాప్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. భారతీయ సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది.

అయితే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రకటించిన పద్మ పురస్కారాలపై సోనూ నిగమ్ విమర్శలు గుప్పించారు. సంగీత ప్రపంచంలో ఎంతోమంది ప్రతిభావంతులు, దిగ్గజ గాయనీ గాయకులు ఉన్నారని ఇలాంటి వారికి పద్మ పురస్కారాలను ప్రకటించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషోర్ కుమార్, మహ్మద్ రఫి వంటి దిగ్గజాలకు నేటికీ సరైన గుర్తింపు దక్కలేదని సోనూ నిగమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్జిత్ సింగ్‌కు పద్మ పురస్కారం రావడమే ఆయన ఆగ్రహానికి కారణమని విశ్లేషకులు అంటూ ఉంటారు.

కాగా.. సోనూ నిగమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. కారు నుంచి దిగి నడవటానికే ఇబ్బంది పడుతున్న ఆయనను నలుగురు వ్యక్తులు తీసుకెళ్లి ఆసుపత్రి బెడ్‌పై పడుకోబెట్టారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి చెబుతూ ఓ వీడియోను సోను నిగమ్ షేర్ చేశారు. తాను స్టేజ్‌పై లైవ్ కన్సర్ట్ చేస్తూ అటూ ఇటూ తిరుగుతుండగా వెన్నులో భరించలేని నొప్పి వచ్చిందని చెప్పాడు. నా వీపులో ఎవరో సూదులతో గుచ్చినట్లుగా అనిపించి కదల్లేకపోయినట్లు వెల్లడించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సోనూ నిగమ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు పోస్ట్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: sonu nigam movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X