వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘స్త్రీ’ టీజర్
వెన్నులో వణుకు పుట్టించే హారర్ సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. బాలీవుడ్లో త్వరలో అలాంటి సినిమా రాబోతోంది. 'స్త్రీ' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రంలో 'సాహో' హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ బుధవారం విడుదల చేశారు. 1990లో కర్ణాటకలోని ఓ గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనలను ఆధారంగా తీసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఓ స్త్రీ దెయ్యంగా మారి పురుషులను హింసించేదని... దాంతో ఆ ఊర్లో 'ఓ స్త్రీ రేపు రా....ఇక్కడ మగాళ్లు ఎవరూ లేరు' అని రాత్రి పూట దండోరా వేయించేవారట. అలా చేస్తే దెయ్యం ఆ రాత్రికి అక్కడి నుండి వెళ్లిపోయేదని వారి నమ్మకం.
భూపాల్‌లోని చందేరీ అనే గ్రామంలో ఈ సినిమాను చిత్రించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. హారర్‌కు కామెడీ కూడా జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 31న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'స్త్రీ' టీజర్ ఆసక్తికరంగా ఉంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

'స్త్రీ' మూవీకి అమర్ కౌసిక్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి, అపర్‌శక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దినేష్ విజయ్, రాజ్ అండ్ డీకె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











