twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లుక్ అదిరిపోయింది: ప్రియాంక చోప్రా-నిక్ జొనాస్ ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ (ఫోటోస్)

    |

    Recommended Video

    Priyanka Chopra And Nick Jonas’s Mumbai Reception Exclusive Video | Filmibeat Telugu

    బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన అమెరికన్ ప్రియుడు నిక్ జొనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1, 2 తేదీల్లో క్రిస్టియన్, హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ఇందుకు వేదికైంది. పెళ్లి తర్వాత వెంటనే ఢిల్లీలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా... ప్రధాని నరేంద్ర మోడీ సైతం హాజరయ్యారు.

    బుధవారం (డిసెంబర్ 19)న ఈ దంపతులు ముంబైలోని ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీడియా వారి కోసం వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ప్రియాంక చోప్రా సబ్యసాచి డిజైన్ చేసిన బ్లూ స్ట్రాప్‌లెస్ కస్టమ్ మేడ్ అనార్కలి డ్రెస్సులో పెద్ద డైమండ్ నక్లెస్ ధరించి ఎంతో అందంగా దర్శనమిచ్చింది. లైట్ గ్రే సూట్లో నిక్ జొనాస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన భర్తను ప్రియాంక అతిథులకు పరిచయం చేశారు.

    అతిథులు ముందు ప్రియాంక ప్రసంగం

    అతిథులు ముందు ప్రియాంక ప్రసంగం

    ‘నా భర్తను ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కలవాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఆశ్వీర్వదించడానికి వచ్చిన అందరికీ థాంక్స్. మా అమ్మ ఈ అందమైన పార్టీ ఏర్పాటు చేశారు. మా నాన్న కూడా ఇక్కడే మన మధ్యే ఉన్నారని తెలుసు. ఈ సాయంత్రం మీరు అద్భుతంగా గడుపుతారని ఆశిస్తున్నాను. ఈయనే నా భర్త నిక్ జొనాస్' అంటూ ప్రియాంక చోప్రా చిన్న స్పీచ్ ఇచ్చారు.

    ప్రియాంక నా జీవితంలోకి

    ప్రియాంక నా జీవితంలోకి

    ‘‘ఇండియాలో ఇది నా ఫస్ట్ షో. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదములు. ప్రియాంక నా జీవితంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక నా జీవితం మరింత సంతోషంగా ఉంటుందనే నమ్మకంతో ఉన్నాను'' అని నిక్ వ్యాఖ్యానించారు.

    ముంబై మారియట్ హోటల్‌లో

    ముంబైలోని జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ప్రియాంక, నిక్ ఈ వేడుకలో హ్యాపీగా, కూల్‌గా కనిపించారు.

    సినీ ప్రముఖుల కోసం

    సినీ ప్రముఖుల కోసం

    కాగా... సినీ ప్రముఖుల కోసం మరో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ముగిసిన తర్వాత ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ అమెరికా వెళ్లనున్నారు. ఇద్దరూ అక్కడే కొత్తకాపురం పెట్టబోతున్నారు.

    English summary
    Priyanka Chopra and Nick Jonas’ second wedding reception held in Mumbai. The couple were a sight to watch as they took the centre stage at the reception hosted especially for media, family and friends. Priyanka looked stunning in a blue strapless custom-made Anarkali by Sabyasachi with a huge diamond necklace adorning her neck. Nick complemented her to perfection in a light grey suit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X