అలాా వేధించాడు.. మహిమా చౌదరీ ఆరోపణలపై సుభాష్ ఘాయ్.. అంతా మీడియా వల్లే

దర్శకులు, హీరోలు-హీరోయిన్ల మధ్య ఒక్కోసారి మనస్పర్థలు వస్తుంటాయి. అయితే అవి ఒక్కోసారి తీవ్ర స్థాయికి కూడా చేరుకోవచ్చు. తాజాగా అలాంటి ఓ సంఘటనే బాలీవుడ్‌లో చోటు చేసుకుంది. ఒకప్పటి హీరోయిన్ మహిమా చౌదరి దర్శకుడు సుభాస్ ఘాయ్ మీద సంచలన ఆరోపణలు చేసింది. తీరా ఆ వార్తలను చూసిన దర్శకుడు నవ్వుకున్నాడట. తమ మధ్య అలాంటి గొడవలు ఏమీ లేవని, నాటి సంగతులను వివరించాడు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

తిట్టాడు, అవకాశాలు రాకుండా..

తిట్టాడు, అవకాశాలు రాకుండా..

మహిమా చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎదురైన సంఘటనను వివరించింది. ఈ క్రమంలోనే దర్శకుడు సుభాష్ ఘాయ్‌తో జరిగిన విషయాలను బయట పెట్టింది. అతను నన్ను చాలా దారుణంగా తిట్టాడు. నాకు అవకాశాలు రాకుండా ప్రయత్నాలు చేశారు. మిగతా వారికి కూడా నన్ను తీసుకోవద్దని చెప్పేవారు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.

నవ్వు వచ్చింది..

నవ్వు వచ్చింది..

మహిమా చౌదరి చేసిన ఆరోపణలు, ఆ వార్తలపై సుభాష్ ఘాయ్ స్పందించాడు. ‘ఇలాంటి వార్తలను చూసి నాకు నవ్వు వచ్చింది. ఈ క్షణం వరకు మేము చాలా మంచి స్నేహితులమే. నిత్యం మెసెజ్‌లు చేసుకునే ఉంటాం. ఆమె ఎంతో మంచిది. 23 యేళ్ల తరువాత పర్‌దేశ్ సినిమాలో ఆమె చేసిన సంగతులను ఆమెను ఎంత బాగా చూసుకున్నామో కూడా గుర్తుకు తెచ్చుకుంది.

అలా జరిగింది..

అలా జరిగింది..

అవును మా మధ్య ఓ చిన్న ఘర్షణ జరిగింది. పర్దేస్ చిత్రం 1997లో రిలీజ్ అయ్యాక ఓ ఘటన జరిగింది. ఆ చిత్రం చాలా గొప్పగా వచ్చింది. పెద్ద హిట్ అయింది. ఆమెకు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకుంది. మా అగ్రిమెంట్‌లో ఓ చిన్న పాయింట్‌ను, నిబంధనను పాటించలేదని షో కాజ్ నోటీసులు ఇచ్చాం.

మీడియానే పెద్దది చేసింది..

మీడియానే పెద్దది చేసింది..

మీడియా, ఇండస్ట్రీ అందరూ దాన్ని పెద్దగా చేసి చూపించారు. ఆ తరువాత ముక్తా ఆర్ట్స్‌తో ఉన్న అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాం. మూడేళ్ల తరువాత ఆమె తన కుటుంబంతో కలిసి వచ్చి మాకు సారీ చెప్పింది. ఆమె దురుసు ప్రవర్తనను క్షమాపణలు చెప్పింది. అలా అప్పటి నుంచి మేమిద్దరం ఇంకా మంచి స్నేహితులం అయ్యాం.

Recommended Video

Hello Guru Prema Kosame Prodcer Harshith byte
ఆమెను ఆరాధిస్తున్నాను..

ఆమెను ఆరాధిస్తున్నాను..

ఆమె నాతో ఎంతో చక్కగా ఉంటుంది. నేను ఆమెను నమ్ముతాను. ఆమెను తిట్టాననే ఫీలింగ్‌లో ఉన్నట్టుంది. 2015లో వచ్చిన నా చివరి చిత్రం కాంచీలో ప్రత్యేక పాత్రను పోషించింది. ఆమెను నేను ఎంతో ఆరాధిస్తాను'అంటూ నాడు జరిగిన విషయాలపై ఓ క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X