సుశాంత్ సింగ్ కేసు సీబీఐ చేతికి.. రంగంలోకి కేంద్ర మాజీ మంత్రి.. ఆ సెక్షన్ల ఆధారంగా!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన జరిగి దాదాపు 25 రోజులు అవుతున్నా.. ఇంకా వేడి చల్లారలేదు. నేటికీ ఆయన అభిమానులు ఆత్మహత్య కాదనీ, సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ మాఫియా, నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని కొందరు అంటుంటే, మాజీ మేనేజర్ దిశ సలియాన్, సూరజ్ పంచోలి వ్యవహారం కారణంగానే సుశాంత్‌ను హత్య చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంలోకి కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యన్ స్వామి ఎంటరయ్యారు.

Recommended Video

Sushant Singh Rajput : Subramanian Swamy Responded On Sushant Singh సూసైడ్ Case || Oneindia Telugu
సుశాంత్ ఆత్మహత్య..

సుశాంత్ ఆత్మహత్య..

సుశాంత్ సింగ్ గత నెల 14న బాంద్రాలోని అతని నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనేది ప్రాథమిక నిర్దారణ. అయితే ఈ ఆత్మహత్య వెనుక పెద్ద కుట్రే ఉందని ప్రధాన ఆరోపణ. సీసీటీవీ పుటేజ్ మాయమైందని, సుశాంత్ ఆత్మహత్య చేసుకుంటాడన్న విషయం మహేష్ భట్‌కు ముందుగానే ఎలా తెలుసని ఇలా ఏవేవో అనుమానాలు రేకెత్తాయి.

 సీబీఐ ఎంక్వైరీ..

సీబీఐ ఎంక్వైరీ..

అయితే సుశాంత్‌కు కావాలనే ఆఫర్స్ రాకుండా చేశారని, తద్వారా డిప్రెషన్‌కు లోనయ్యేలా చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. మాజీ మేనేజర్ దిశ సలియాన్ మృతి, సూరజ్ పంచోలి వ్యవహారం కారణంగానే సుశాంత్‌ను పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే నిజానిజాలను వెలికి తీయాలని సీబీఐకి అప్పగించాలని ఫ్యాన్స్, నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఆ సెక్షన్ల ఆధారంగా..

ఆ సెక్షన్ల ఆధారంగా..

ఇష్కరన్ భండారి అనే లాయర్ సుశాంత్ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తాడట. కచ్చితమైన ఆధారాలు, వివరాలు, సమాచారం ఉంటే అతనికి తెలియజేయండని కోరాడు. ఐపీసీ సెక్షన్ 306, 308, ఆర్టికల్ 21 ఆధారంగా మనం ఈ కేసును తగిన ఆధారాలతో సీబీఐకి అప్పగించేలా చేయొచ్చని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X