twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్‌ను స్టన్ గన్‌తో చంపేశారు.. రియాను అరెస్ట్ చేయాలి.. ఎన్‌ఐఏ దర్యాప్తుకు డిమాండ్!

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి రెండు నెలలుగా గడుస్తున్నప్పటికీ ఆయన మరణం వెనుక అసలు వాస్తవం బయటకు రాలేకపోయింది. అయితే సుశాంత్ మరణం వెనుక ఎన్నో అనుమానాలు, రకరకాల వదంతులు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి అనేక సందేహాల మధ్య సోషల్ మీడియాలో నెటిజన్లు కొత్తరకమైన వాదనను ముందుకు తెచ్చారు. నెటిజన్ల కామెంట్లపై బీజేపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు లో రియాను అరెస్ట్ చేయాలి.. NIA దర్యాప్తుకు డిమాండ్!
    సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

    సోషల్ మీడియాలో పోస్టులు వైరల్

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను స్టన్ గన్‌తో చంపేశారు. సుశాంత్ మరణానికి కారణం రియా చక్రవర్తి, శివసేన యువ నాయకుడు ఆదిత్య థాక్రే అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ ఎంపీ సుబ్రమణ్యస్వామికి ట్యాగ్ చేశారు. దాంతో స్టన్ గన్‌తో మనిషిని ఎలా చంపుతారు? స్టన్ గన్ అంటే ఏమిటనే కోణంలో రీసెర్చ్ చేశాను అని స్వామి చెప్పుకొచ్చారు.

    నెటిజన్ ట్వీట్‌పై స్వామి స్పందన

    నెటిజన్ ట్వీట్‌పై స్వామి స్పందన

    సుశాంత్ మరణంపై ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేస్తూ.. ఈ రోజు నేను స్టన్ గన్స్ ఉపయోగం గురించి చాలా చదివాను. వాటిని ఎలా ఉపయోగిస్తారనే విషయంపై అవగాహన పెంచుకొన్నాను. స్టన్ గన్‌తో కాల్చితే ఎలాంటి మచ్చలు ఏర్పడుతాయి. అలాంటి మచ్చలే సుశాంత్ దేహంపై కనిపించాయి. అరెస్ట్ రియా చక్రవర్తి, ఆదిత్య థాక్రే అంటూ హ్యాష్ టాగ్‌తో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై సుబ్రమణ్యస్వామి స్పందించడంతో వైరల్‌గా మారింది.

     ఆ దేశాల నుంచి వచ్చాయా?

    ఆ దేశాల నుంచి వచ్చాయా?

    నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఇలాంటి గన్స్ అరేబియా సముద్ర సరిహద్దు దేశాలను నుంచి స్మగ్లింగ్ అయ్యాయా? అంటూ సుబ్రమణ్యస్వామి అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేయాల్సిందే అంటూ ట్వీట్‌కు సుబ్రమణ్యస్వామి స్పందించారు.

    సుశాంత్ మరణంపై అమెరికా డాక్టర్‌ అనుమానం

    సుశాంత్ మరణంపై అమెరికా డాక్టర్‌ అనుమానం

    స్టన్ గన్ ఉపయోగంపై అమెరికాలోని డాక్టర్ రాజు వాద్వా పెట్టిన పోస్టు మరింత ఆసక్తిని రేపింది. సుశాంత్ కేసులో స్టన్ గన్స్ ఉపయోగించి ఉండవచ్చు. అమెరికాలో అనుమానాస్పద సూసైడ్‌లో నేవీ అధికారులు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకొన్నారు అని రాజు వాద్వా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    స్టన్ గన్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

    స్టన్ గన్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

    స్టన్ గన్ అంటే ఎలక్ట్రానిక్ షాక్ ఇచ్చే ఆయుధం. ఎవరిపై దాడి చేయాలనుకొంటే వారిని టార్గెట్ చేసి స్టన్ గన్ ఉపయోగిస్తే.. కండరాలను నిర్వీర్యం చేస్తుంది. ఆ వ్యక్తిని అచేతనంగా మారుస్తుంది. ఎలాంటి గాయాలు కలగకుండా కొంత నొప్పితో ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. స్టన్ గన్స్, బ్యాటన్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల రూపాల్లో మార్కెట్లో లభిస్తున్నాయి.

    English summary
    Subramanian Swamy demands NIA probe in Sushant Singh Rajput case. A netizen raised doubt about Sushant Singh Rajput death. today i have read alot about stun guns and hw they r used ! also wat mark do they leave ! the exact mark❗❗ guyzz they really used stun guns to paralyse him! #ArrestRhea #adityathackeray Retweet 🙏
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X