పాన్ ఇండియా మూవీతో సుధీర్ బాబు.. బాలీవుడ్ హీరోయిన్, బడా నిర్మాతలతో వరల్డ్ క్లాస్ మూవీ!
కంటెంట్‌తోపాటు కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే యువ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. విభిన్నమైన కథలతో సినిమాలు చేయాలనే ప్రయత్నం ఆయనలో కనిపిస్తుంది. తాజాగా వచ్చిన హరోమ్ హర సినిమాతో మంచి మాస్, యాక్షన్ సినిమాతో మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా విజయం తర్వాత తాను ఎంచుకొన్న సినిమా పాన్ ఇండియా కావడంతో అభిమానులు, ఆసక్తితో ఎదురు చూసేలా చేసింది. నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆలరించేందుకు వస్తున్నారు. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..
హిందీలో రుస్తుం, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి లాంటి చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా ప్రజెంట్ చేస్తున్న చిత్రానికి వెంకట్ కల్యాణ్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నారు. అలాగే బాలీవుడ్‌లో యువ హీరోయిన్ ఈ సినిమాలో సుధీర్‌బాబుకు జోడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్, మంచి కథతో వస్తున్న ఈ సినిమా ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

డెప్త్ ఉన్న కంటెంట్‌తో కుట్రలతో సాగే.. మంచి చెడు యుద్దం లాంటి కథతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచే చిత్రంగా మిగిలిపోతుందనే విశ్వాసాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్, అనుభూతిని అందించే చిత్రంగా రూపుదిద్దుకొనే ఈ సినిమాను వచ్చే ఏడాది శివరాత్రికి రిలీజ్ చేస్తామని చెప్పారు.
భారతీయ పురాణాలతో కనెక్ట్ ఉండే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతున్నది. చరిత్రలో మరుగున పడి ఉన్న ఎన్నో చీకటి కోణాలు, రహస్యాలను ఈ కథ ద్వారా చెప్పబోతున్నాం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అని చితర్ నిర్మాతలు ప్రేరణ అరోరా, శివన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ నంద తెలిపారు.

దర్శకుడు వెంకట్ కల్యాణ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ టీమ్‌తో ఏడాదికాలంగా జర్నీ చేస్తున్నాం. అత్యంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా. ఈ కథను ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలా? అని ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడమే కాకుండా హృదయాన్ని తాకుతుందని నవ దళపతి సుధీర్ బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











