ఒకేసారి ఇద్దరితో చేయకు.. షారుక్ కూతురుకు రొమాంటిక్ సలహా.. ఎవరిచ్చారంటే?
బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్‌ను బాద్షా అని అభిమానులు, సినీ వర్గాలు ముద్దుగా పిలుచుకొంటాడు. చిన్న చిన్న పాత్రలతో తనకంటూ ఓ కెరీర్‌ను ఏర్పాటు చేసుకొని హిందీ సినిమా సూపర్ స్టార్‌గా ఎదిగారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్ తర్వాత కూడా ఇండస్ట్రీ హిట్స్‌తో తన సత్తాను నిరూపించుకొంటున్నారు. ప్రస్తుతం తన కుటుంబం నుంచి వారసులను పరిచయం చేస్తున్నారు. అయితే వారిద్దరి పిల్లల విషయంలో తల్లి, నిర్మాత గౌరీ ఖాన్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ఆమె వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
ఇండస్ట్రీలోకి వారసులు రావడం సాధారణమే. ఎన్నో ఏళ్లుగా ఇండియన్ భాషల్లో స్టార్ హీరోలు, నిర్మాతల పిల్లలు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం తెలిసిందే. ప్రస్తుతం షారుక్ ఇద్దరు పిల్లలు సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాను ఇండస్ట్రీలోకి రాక ముందే ఆర్యన్ భారీ వివాదంలో చిక్కుకు పోవడం షారుక్ కుటుంబాన్ని తీవ్ర డిప్రెషన్‌కు గురిచేసింది.

అయితే ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం.. కొన్నాళ్లు జైలులో గడపడం విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే సెలబ్రిటీల పిల్లల మీద అందరి దృష్టి ఉంటుంది. కాబట్టి నేను ఎప్పడూ వారికి జాగ్రత్తగా ఉండాలని నేను సలహాలు ఇస్తుంటాను గౌరీ ఖాన్ తన అభిప్రాయాలను పంచుకొన్నది. ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తల్లిగా కొన్ని సలహాలు ఇస్తుంటానని వెల్లడించారు.
యుక్త వయసులో ఉండే నేటి తరం పిల్లల ఆలోచనలు డిఫరెంట్. మా జనరేషన్ కంటే ఎంతో ముందు ఉన్నారు. అన్ని విషయాల్లోను వారు అడ్వాన్స్‌గానే ఉంటున్నారు. ఇప్పటి యువతీ, యువకులను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వారికి వారి జీవితంలో చాలా క్లారిటీ ఉంది. రిలేషన్‌షిప్ విషయంలో వాళ్లు చాలా యాక్టివ్‌గా ఉంటారు అని చెప్పారు.

అయితే నా కూతురుకు రిలేషన్‌షిప్, అఫైర్, డేటింగ్ విషయంలో నేను ఒక్కటే చెబుతుంటాను. చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంటాను. ఒకేసారి ఇద్దరితో డేటింగ్, అఫైర్ పెట్టుకోవద్దని క్లారిటీతో చెబుతుంటాను. ఇద్దరితో ఒకేసారి డేటింగ్ చేస్తే చాలా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలని సుహానాకు చెబుతుంటాను అని గౌరీ ఖాన్ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
సుహానా ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. న్యూయార్క్ ఫిలిం స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి యాక్టింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. థియేటర్‌లో ఆమె బిజీగా ఉంటూ వస్తున్నారు. హాలీవుడ్‌లో ది గ్రే పార్ట్ ఆఫ బ్లూ, హిందీలో ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో కింగ్ అనే సినిమాలో తండ్రి షారుక్‌తో కలిసి సుహానా నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











