Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
యువ క్రికెటర్‌తో డేటింగ్ మొదలు పెట్టిన షారుఖ్ కుమార్తె..!
Recommended Video
బాలీవుడ్ తారలు, క్రికెటర్స్ మధ్య ప్రేమ చిగురించే సంఘటనలు ఎక్కువవుతున్నాయి. యంగ్ క్రికెటర్ కెఎల్ రాహుల్, హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ అభిమానుల్లో చర్చ జరుగుతున్న సమయంలో మరో ప్రేమ కథ తెరపైకి వచ్చింది. ఈ సారి బాలీవుడ్ బాద్షా షారుఖ్ కుమార్తె గురించే ఊహాగానాలు మొదలైపోయాయి. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్, యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది
షారుఖ్ కుమార్తె సుహానా ఇంకా బాలీవుడ్ రంగప్రవేశం చేయలేదు కానీ అప్పుడే సోషల్ మీడియాలో మాత్రం చెలరేగిపోతోంది. ఈ యంగ్ బ్యూటీ అందాలకు యువత ఫిదా అవుతున్నారు.
యంగ్ క్రికెటర్‌తో పరిచయం
షారుఖ్ ఐపీఎల్ జట్టు కోల్ కతా కు యజమాని అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ పరిచయం ప్రేమగా మారిందట. ఐపీఎల్ మ్యాచ్ అనంతరం వీరిద్దరూ ముచ్చటించుకున్న దృశ్యాలు హాట్ టాపిక్ గా మారాయి.
పార్టీలు, పబ్బుల్లో హల్ చల్
వీరిద్దరూ ప్రస్తుతం గాఢమైన ప్రేమతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీల్లో, పబ్బుల్లో హల్ చల్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
బాలీవుడ్ భామలతో క్రికెటర్స్
ఇటీవలే హాట్ బ్యూటీ నిధి అగర్వాల్, యంగ్ క్రికెటర్ కెఎల్ రాహుల్ తో డిన్నర్ డేట్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. రాహుల్ తనకు టీనేజ్ నుంచే పరిచయం అని బదులిచ్చింది.