HBD Suhana :బర్త్ డే డ్రెస్లో హాట్ లుక్.. హీరోయిన్స్ కి ఎక్కడా తగ్గని స్టార్ కిడ్!
బాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సుహానా ఖాన్. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల ముద్దుల కూతురు ఆమె. బీటౌన్ స్టార్ నటుడి కుమార్తె అయినప్పటికీ ఆమె అనేక ట్రోలింగ్స్ ఎదుర్కొనేది. ఇక ఈ భామ తాజాగా 21 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

ట్రోలింగ్స్ మీద ఆవేదన
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుహానా ఖాన్ ఒకప్పుడు తన విషయంలో జరిగిన ట్రోలింగ్స్ గురించి ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ట్రోల్స్‌పై స్పందించిన సుహానా తన శరీర రంగు మీద కామెంట్ చేస్తున్న వారికి ధీటుగా సమాధానం ఇచ్చింది. తన 12వ ఏట నుంచే తన శరీరం రంగు గురించి చెడుగా మాట్లాడుతున్నారని ఆమె వెల్లడించింది.

బర్త్ డే స్పెషల్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌ల ముద్దుల కూతురయిన సుహానా ఖాన్ తాజాగా తన పుట్టిన రోజు సంధర్భంగా కొన్ని పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ స్టార్ కిడ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన స్పెషల్ బర్త్ డే పోస్ట్‌తో తన అభిమానులను మరియు ఫాలోవర్స్ ను ఆనందపరిచింది. ఆకుపచ్చ బాడీ కాన్ డ్రెస్ ధరించిన ఆమె హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది.

ట్వంటీ వన్ లోకి ఎంట్రీ
ఇక ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోకి ఆమె స్నేహితులు, షారుఖ్ ఖాన్ అభిమానులు, చిత్రసీమలోని వివిధ శాఖలకు చెందిన వారు సుహానాను అభినందనలతో ముంచెత్తారు. ఇక ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ కేవలం 'ట్వంటీ వన్' అనే పదమే రాసింది. ఇక ఆమె ఫోటోకి అనన్య పాండేను మొదలు కొని జోయా అక్తర్, సీమా ఖాన్, భావన పాండే, మహీపాల్ కపూర్ వరకూ అందరూ లవ్ ఎమోజీలతో సుహానాకు శుభాకాంక్షలు తెలిపారు.
త్వరలో సినీ ఎంట్రీ
ఇక సుహానా తల్లి గౌరీ ఖాన్ సైతం సుహానా చిన్నప్పటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే నాటక రంగంలో సుహానా తన సత్తా చాటుతోంది. అయితే ఆమె త్వరలో సినిమాల్లో నటిగా రాణించాలని భావిస్తోంది. ఇక ఆ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖాన్ చెప్పారు కూడా.సో ఇక త్వరలో ఆమె సినీ ఎంట్రీ కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











