పార్టీలో ఫెండ్స్‌తో అర్ధనగ్నంగా సూపర్‌స్టార్ కూతురు... ఫోటోస్ వైరల్!
Recommended Video
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. విదేశాల్లో చదువుకునే ఈ పాప తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోస్ ఇండియన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా మరోసారి సుహానాకు సంబంధించిన ఫోటోస్ వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోల్లో సుహానా ఖాన్ చుట్టూ ఉన్నవారంతా కూడా ఆమెతో పాటు చదువుకునే విదేశీ స్నేహితులే కావడం గమనార్హం. అయితే ఇండియన్ కల్చర్‌కు పూర్తి భిన్నంగా ఉన్న ఈ పార్టీలో సుహానాను చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇందులో ఆమె స్నేహితులు హద్దులు దాటినట్లు కనిపించినా... సుహానా మాత్రం ఒద్దికగానే కనిపించారు.

హై ప్రొఫైల్ కుటుంబాలకు చెందిన పిల్లల జీవన విధానం
ఈ పార్టీలో పాల్గొన్న అమ్మాయిలంతా రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ ధరించి ఉన్నారు. హై ప్రొఫైల్ కుటుంబాలకు చెందిన పిల్లల జీవన విధానం, స్నేహితులు, పార్టీ కల్చర్ ఎలా ఉంటుందో ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. పాశ్చాత్య పోకడలకు అద్దం పడుతున్న ఈ పార్టీ ఫోటోలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

షర్ట్ విప్పేసిన బాయ్స్... గర్ల్స్‌తో కలిసి రచ్చ రచ్చ
మిత్ర బృందంలోని అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి పార్టీలో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో కొందరు బాయ్స్ షర్టు విప్పేసి ఉండటం గమనార్హం. సుహానా ఖాన్ అండ్ గ్యాంగ్ చేసిన రచ్చ రంబోలా హంగామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఫ్యాన్ ఫాలోయింగ్
సోషల్ మీడియాలో సుహానా ఖాన్ తనకంటూ ప్రత్యకమైన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనే ఆలోచనలో ఉన్న ఈ చిన్నది అందుకు తగిన విధంగానే సిద్ధమవుతోంది. సాధారణ జనాలకు ఈ పార్టీ కల్చర్ కాస్త వింతగా అనిపించొచ్చు కానీ... సెలబ్రిటీ సర్కిల్‌లో ఇది సర్వసాధారణమే.

నటనలో శిక్షణ తీసుకుంటోంది
నటిగా తెరంగ్రేటం చేసే ఆలోచనలో ఉన్న సుహానా ప్రస్తుతం శిక్షణ తీసుకుంటోంది. షార్ట్ ఫిల్మ్స్ చేయడంతో పాటు థియేటర్ ప్లేస్ చేస్తోంది. ఆమె తన తండ్రి షారుక్ ఖాన్ సపోర్టు కూడా ఉంది. అయితే సుహానా సినీ తెరంగ్రేటం ఎప్పుడనే విషయంలో క్లారిటీ లేదు. చదువు పూర్తయిన తర్వాతే ఆమె సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











