twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో కూతురి సెక్సీ లుక్.. ఇకపై వెండితెర మీద కూడా!

    |

    వెండితెరపై స్టార్ కిడ్స్ ఆరంగేట్రం చేయడం, ఆ తర్వాత రాణించడం కామన్‌గా జరిగే పరిణామమే. ఈ కోవలోనే తాజాగా బాలీవుడ్ తెరపై షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఎంట్రీ ఖాయమే అని తెలుస్తోంది. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు సుపరిచమైన సుహానా ఖాన్.. ఈ మధ్యన ఆ వేడి మరింత పెంచేసింది. తన హాట్ హాట్ పోజులు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఓ పిక్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.

    సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న సుహానా ఖాన్.. తెరంగేట్రానికి ముందే మీడియాను తన వైపు తిప్పుకుంటోంది. ఇటీవలే తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెకేషన్ ట్రిప్ వేసింది సుహానా. ఓ వారం పాటు ఫ్యామిలీతో సరదాగా షికారు చేసిన ఆమె.. అక్కడి బీచ్ లొకేషన్స్ లో అందమైన ఫోటోలకు ఫోజిచ్చింది. అందులో ఒక పిక్‌ని నెట్టింట షేర్ చేసింది సుహానా. ఒక బోటుపై కూర్చున్న సుహానా స్టైల్‌గా పోజివ్వడమే గాక బటన్లు లేని ఓ షర్ట్, షార్ట్ ధరించి తనలోని హాట్‌నెస్‌కి మరింత పదును పెట్టింది.

     Suhana Khan Sexy Look In Maldives

    ఈ పిక్ చూసిన నెటిజన్లు సుహానాను సినీ తెరపై అడుగుపెట్టాల్సిందిగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల వారసులైన సారా అలీఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్‌లు వెండితెర ఎంట్రీ ఇచ్చారు.. కాబట్టి సుహానా ఖాన్ కూడా తవ్రలోనే వెండితెరపై కాలుమోపుతుందని తెలుస్తోంది. అయితే సుహానా ఖాన్ సినీ జర్నీపై ఇప్పటి వరకు ఆమె తండ్రి షారుఖ్ ఖాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.

    English summary
    The latest B-Town crush, superstar Shah Rukh Khan's darling daughter Suhana Khan is a total stunner. Her pictures always create a buzz around the town, without fail and go viral. Recently, the star kid was chilling with her family in Maldives.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X