twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jacqueline, నోరా ఫతేహికి బిగిస్తున్న ఈడీ ఉచ్చు.. అమిత్ షా నంబర్‌తో సుఖేష్ ఫోన్ కాల్స్.. భార్యతో అలాంటి దందా

    |

    200 కోట్ల రూపాయలకు పైగా మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, హోంమంత్రి అమిత్ షా నంబర్‌ను కూడా స్పూఫ్ చేశారని తేలింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో స్నేహం చేసేందుకు చంద్రశేఖర్ ఇలా చేశాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. ఇవే కాక ఆయన గిఫ్ట్ ల రూపంగా ఇచ్చిన విషయాల మీద కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే..

     జాక్వెలిన్‌ను శేఖర్‌గా కలిసిన సుకేష్

    జాక్వెలిన్‌ను శేఖర్‌గా కలిసిన సుకేష్

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయ నంబర్‌ను 'స్పూఫ్' చేస్తూ సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కు ఫోన్ చేశారని ఈడీ తెలిపింది. తాను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత "రాజకీయ కుటుంబానికి" చెందిన వాడిని అని పరిచయం చేసుకున్నాడు అని ఆమె పేర్కొన్నారు. ఈడీ, మనీలాండరింగ్ (నివారణ) చట్టం కింద దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఈ సమాచారం ఇచ్చారు. 'కాల్ స్పూఫ్' అంటే ఫోన్ రింగ్ అయినప్పుడు, కాల్ చేసిన వ్యక్తి యొక్క నిజమైన నంబర్ కాకుండా మరొకరి నంబర్ కనిపిస్తుంది. ఈ ఏడాది 36 ఏళ్ల ఫెర్నాండెజ్ వాంగ్మూలాన్ని ఏజెన్సీ రెండు సార్లు నమోదు చేసింది, అందులో చంద్రశేఖర్ తనను తాను 'శేఖర్ రత్న వేలు'గా పరిచయం చేసుకున్నాడని చెప్పాడు. ఏజెన్సీ ఈ నెల ప్రారంభంలో ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పిఎంఎల్‌ఎ) కోర్టు ముందు చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో చంద్రశేఖర్, అతని భార్య లీనా మరియా పాల్ మరియు మరో ఆరుగురి పేర్లను పేర్కొంది.

     ఈడీ కేసులో జాక్వెలిన్ ఎందుకు చిక్కుకుంది?

    ఈడీ కేసులో జాక్వెలిన్ ఎందుకు చిక్కుకుంది?

    ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకారం, సుకేష్ మంచి నీళ్ల లాగా జాక్వెలిన్‌పై డబ్బు వెదజల్లాడు. అలా ఆమెకు భ్రమ కల్పించడం కోసం దాదాపు రూ.10 కోట్లు వెచ్చించారని తేలింది. బంగారం, వజ్రాల ఆభరణాలు, దిగుమతి చేసుకున్న టపాకాయలు, 52 లక్షల విలువైన గుర్రాన్ని, నాలుగు పెర్షియన్ క్యాట్స్ ను కూడా బహుమతిగా ఇచ్చాడు. ఒక పిల్లి ఖరీదు రూ.9 లక్షలు కాగా జాక్వెలిన్ కోసం సుకేష్ చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా ఏర్పాటు చేశాడని, వీటి కోసం చాలా కోట్లు ఖర్చు చేశాడని గుర్తించారు. ముంబై నుంచి ఢిల్లీకి చార్టర్డ్ విమానంలో పిలిపించి, ఢిల్లీ నుంచి చెన్నైకి కూడా చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. ఇద్దరూ చెన్నైలోని వేర్వేరు ఖరీదైన హోటళ్లలో బస చేశారు. ఇద్దరు మూడు నాలుగు సార్లు కలిశారని గుర్తించారు.

    బహుమతులు

    బహుమతులు

    ఇవే కాక 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా మరియు నోరా ఫతేహికి కూడా సుఖేష్ చంద్రశేఖర్ లక్షల విలువ చేసే బహుమతులు అందించినట్లు ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది . చార్జిషీట్ ప్రకారం, జాక్వెలిన్ మరియు నోరా కూడా సుఖేష్ చంద్రశేఖర్ కోట్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు అంగీకరించారు. ఈ ఖరీదైన బహుమతులలో బ్రాండెడ్ బట్టల నుంచి ఖరీదైన ఆభరణాలు, బూట్లు, బ్రాండెడ్ వాచీల వరకు అనేక వస్తువులు ఉన్నాయి. ఇక పలు వెబ్ సైట్స్ కధనాలా మేరకు సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను తన మేకప్ ఆర్టిస్ట్ ద్వారా కలుసుకున్నారని నివేదించింది. జాక్వెలిన్ మేకప్ ఆర్టిస్ట్‌ను స్పూఫింగ్ ద్వారా పిలిచి సుకేష్ తనను తాను హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు బంధువుగా సుకేష్ చంద్రశేఖర్ అభివర్ణించుకుని సన్ టీవీ యజమాని అని కూడా నమ్మించాడు.

    వాట్సాప్ కాల్ ద్వారా

    వాట్సాప్ కాల్ ద్వారా

    ఫిబ్రవరి 2021లో WhatsApp లో మొదటి చర్చ ఫిబ్రవరి 2021లో సుకేష్ చంద్రశేఖర్ తొలిసారిగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడాడు. అలా ఫిబ్రవరి 2021 నుండి ఆగస్టు 2021 వరకు జాక్వెలిన్‌తో టచ్‌లో ఉన్నాడని తేలింది. అప్పటి వరకు అరెస్ట్ అయ్యే దాకా ఈ సమయంలో జాక్వెలిన్‌కి చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. నివేదిక ప్రకారం, సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ కోసం చార్టర్డ్ ఫ్లైట్‌ను కూడా ఏర్పాటు చేశారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోరిక మేరకు సుకేష్ స్క్రిప్ట్ రైటర్‌కు డబ్బు చెల్లించినట్లు కూడా ఛార్జిషీట్ వెల్లడించింది. ఈ స్క్రిప్ట్ రైటర్ పేరు అద్వైత్ కాలా అని చెబుతున్నట్లు జాక్వెలిన్ విచారణలో తెలిపింది. నివేదిక ప్రకారం, అద్వైత్ కాల స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేయబడింది.

    జాక్వెలిన్‌కి వీరాభిమానినని

    జాక్వెలిన్‌కి వీరాభిమానినని

    మరోవైపు, సుఖేష్ చంద్రశేఖర్ తనకు ఖరీదైన బహుమతులు ఇచ్చాడని జాక్వెలిన్ కూడా ప్రకటనలో ధృవీకరించింది. శేఖర్ రత్న వేలగా సుకేష్ తనను కలిశాడని జాక్వెలిన్ చెప్పింది. జాక్వెలిన్ కూడా తాను శ్రీలంకకు చెందిన దానిని అని, తన తల్లిదండ్రులు బహ్రెయిన్‌లో నివసిస్తున్నారని విచారణలో చెప్పారు. జాక్వెలిన్ ప్రకారం, సుఖేష్ డిసెంబర్ 2020 నుండి జనవరి 2021 వరకు ఆమెను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడని, అయితే ఆమె స్పందించకపోవడంతో సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ మేకప్ ఆర్టిస్ట్‌ని సంప్రదించి ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. తాను జాక్వెలిన్‌కి వీరాభిమానినని, ఆమెతో ఓ సౌత్ సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పాడని గుర్తించారు. ఈ సందర్భంలో, నటీమణి నోరా ఫతేహీ కూడా సుఖేష్ BMW కారు 5 సిరీస్ తనకు గిఫ్ట్ ఇచ్చాడని పేర్కొంది. సుకేష్ భార్య లీనా మరియా పాల్ సహాయంతో నోరా ఫతేహి చెన్నైలో జరిగిన ఓ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు విచారణలో వెల్లడైంది. దీని కోసం లీనా నోరా ఫతేహికి ఐఫోన్ మరియు గూచీ బ్యాగ్‌ని ఆమె బహుమతిగా ఇచ్చింది. సుకేష్ చంద్రశేఖర్ కూడా అప్పటి నుంచి నోరా ఫతేహితో టచ్‌లో ఉన్నాడని తేలింది.

    English summary
    sukesh Chandrasekhar 'Spoof' Amit Shah's Office Number To Befriend Jacqueline Fernandez.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X