For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Jacqueline Fernandez మనీలాండరింగ్ కేసు.. తీహార్ జైలు నుంచే ఘరానా మోసం అలా!

  |

  మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం విచారించారు. విచారణ తరువాత, తీహార్ జైలు లోపల నుండి 200 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కిలాడీ సుకేష్ చంద్రశేఖర్, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండస్‌తో ఫోన్లో మాట్లాడే వాడని వెల్లడైంది. అంతే కాక అందుకోసం అతను వాడిన టెక్నిక్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

  Avinash Engagement: అవినాష్ పెళ్లాడే అమ్మాయి ఎవరంటే.. పర్సనల్ ఫొటోల్లో ఎలా ఉందో చూడండి!

  మహానగరంలో మాయగాడు

  మహానగరంలో మాయగాడు

  గతవారం, చెన్నైలో మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ కు చెందిన బంగ్లాపై ఈడీ దాడి చేసింది. ఢిల్లీ తిహార్ జైల్లో విచారణలో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ ఒక వ్యాపారవేత్త నుండి ఒక సంవత్సరం వ్యవధిలో 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతడిపై 20 కి పైగా ఇతర దోపిడీ కేసులు కూడా ఉన్నాయి మరియు అతని జైలు గది లోపల నుండి ఒక రాకెట్‌ను నిర్వహించాడని గుర్తించారు.

  Ananya Nagalla : అప్పట్లో అలా ఇప్పట్లో ఇలా.. బొద్దుగా vs ముద్దుగా!

  24కి పైగా కాల్ రికార్డులు

  24కి పైగా కాల్ రికార్డులు

  దర్యాప్తు సంస్థలు సుకేష్ చంద్రశేఖర్ కి సంబంధించిన 24కి పైగా కాల్ రికార్డులు సంపాదించాయి. ఆ కాల్ రికార్డులు ఆధారంగా జాక్వెలిన్ ఫెర్నాండస్‌కి సుఖేష్ చేసిన గురించి దర్యాప్తు ఏజెన్సీలకు తెలిసింది. ఆమెను సుఖేష్ ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా, సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో ఏమి మాట్లాడాడో దర్యాప్తు సంస్థ వెల్లడించలేదు.

  కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా చూశారా?

  మాయలో పడిపోయిందని తెలియడంతో

  మాయలో పడిపోయిందని తెలియడంతో

  జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ మాయలో పడిపోయిందని తెలియడంతో ఆమెను పిలిచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు. ఈ విచారణ తరువాత అసలు మొత్తం విషయం మీద ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది. సుకేష్ చంద్రశేఖర్ మరో బాలీవుడ్ నటిని టార్గెట్ చేయడానికి ప్రయత్నించాడని, జాక్వెలిన్ ను ట్రాప్ చేసినట్టుగానే స్పూఫింగ్ ద్వారా కాల్ చేశాడు కానీ అతని లక్ష్యం నెర వేరలేదు, అంతకు ముందే ఈడీ టార్గెట్ చేసింది.

  Sridevi Soda Center యూనిట్‌కు మహేష్ బాబు, నమ్రత అభినందనలు.. సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ అంటూ!

  స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్‌తో

  స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్‌తో

  తీహార్ జైలు లోపల నుండి సుకేష్ చంద్రశేఖర్ కాల్ స్పూఫింగ్ ద్వారా జాక్వెలిన్‌తో మాట్లాడేవాడు అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అతను సుకేశ్ చంద్రశేఖర్‌ అని చెప్పుకోవడానికి బదులుగా వేరొకరిలా అంటే ఒక బిగ్ షాట్ ను అన్నట్టుగా ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడని గుర్తించారు. జాక్వెలిన్ కు అతను ఫోన్ లో పెద్ద వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడని తెలిసింది.

  జైలు నుంచే ఖరీదైన గిఫ్టులు

  జైలు నుంచే ఖరీదైన గిఫ్టులు

  దర్యాప్తు సంస్థ ప్రకారం, సుకేష్ చంద్రశేఖర్ను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నమ్మడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమెకు ఖరీదైన పువ్వులు మరియు చాక్లెట్లు కూడా పంపడం ప్రారంభించాడని గుర్తించారు. అయితే ఇవన్నీ తీహార్ జైలులో ఖైదు చేయబడిన దేశంలోనే అతిపెద్ద మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ పంపుతున్నాడనే విషయం జాక్వెలిన్ కు తెలియదని అధికారులు చెబుతున్నారు. అతని కుట్రల గురించి ఆమెకు తెలియదని పేర్కొన్నారు.

  Recommended Video

  Cheruvaina Dooramaina Movie Public Talk మర్డర్ మిస్టరీతో ప్రేమ కథా చిత్రంగా!!
  4 రోజుల రిమాండ్

  4 రోజుల రిమాండ్

  జైలు నుంచి రూ .200 కోట్లు మోసం చేసిన సుకేష్ చంద్రశేఖర్ రిమాండ్ సమయం కూడా పెరిగింది. ఎకనామిక్ అఫెన్సస్ వింగ్ సుకేష్ ను మరో 4 రోజుల పాటు రిమాండ్ లో ఉంచనుంది. అలాగే ఢిల్లీ పోలీసుల ఎకనామిక్ అఫెన్సస్ వింగ్ కూడా త్వరలో సుకేష్ చంద్రశేఖర్ భార్య లీనా పాల్‌ను ప్రశ్నించడానికి పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

  ఈ ఎకనామిక్ అఫెన్సస్ వింగ్ ఈడీతో టచ్‌లో ఉందని అంటున్నారు. మాజీ రాన్‌బాక్సీ ప్రమోటర్ మల్వీందర్ మోహన్ సింగ్ భార్య ఫిర్యాదు ఆధారంగా తీసుకున్న చర్యల దృష్ట్యా ఎకనామిక్ అఫెన్సస్ వింగ్ సుకేష్ కి తాజాగా 4 రోజుల రిమాండ్ విధించింది.

  English summary
  As per Enforcement Directorate (ED) sources Conman Sukesh Chandrasekhar used to spoof call actor Jacqueline Fernandez from Tihar jail.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X