twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మందిరాబేడి భర్త మరణం వెనుక అసలు కారణం.. అంతా 10 నిమిషాల్లోనే అంటూ మ్యూజిక్ డైరెక్టర్ వెల్లడి

    |

    ప్రముఖ నటి మందిరా బేడి భర్త, దర్శకుడు రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. రాజ్ కౌశల్ ఇక లేరనే విషయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. బుధవారం జూన్ 30 తేదీన తెల్లవారుజామున రాజ్ కౌశల్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం గురించి ప్రముఖ సంగీత దర్శకుడు, స్నేహితుడు సులైమాన్ మర్చంట్ మీడియాతో మాట్లాడుతూ...

    మా ఇద్దరి మధ్య 25 ఏళ్ల స్నేహం

    మా ఇద్దరి మధ్య 25 ఏళ్ల స్నేహం

    రాజ్‌ కౌశల్‌తో నాకు 25 ఏళ్ల స్నేహ బంధం ఉంది. ముకుల్ ఆనంద్‌ తీసిన దస్ సినిమాకు అసిస్టెంట్‌గా ఉన్నప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ప్యార్ మే కభీ కభీ అనే సినిమాకు నేను, సలీం సంగీతం అందించాం. ఇటీవలే ఆయన ఇంటికి వెళ్లి వచ్చాను. ఆయన మరణించడం చాలా షాకింగ్‌గా ఉంది అని సులైమాన్ మర్చంట్ అన్నారు.

    మంగళవారం నుంచి ఛాతిలో నొప్పి

    మంగళవారం నుంచి ఛాతిలో నొప్పి

    రాజ్ కౌశల్ మరణానికి కొద్ది గంటల ముందు జరిగిన విషయాలను వెల్లడించారు. ముందు రోజు రాత్రి నుంచి రాజ్ కౌశల్ ఛాతిలో నొప్పితో బాధపడుతున్నారు. దాంతో ఎసిడిటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వేసుకొన్నారు. అర్ధరాత్రి ఆ నొప్పి విపరీతంగా పెరిగింది. దాంతో ఆయనలో మరింత ఆసౌకర్యం పెరిగింది. దాంతో మందిరా బేడి హార్ట్ ఎటాక్ అనే అనుమానం ఆమెలో కలిగింది అని చెప్పారు.

    అప్రమత్తమైన మందిరా బేడి

    అప్రమత్తమైన మందిరా బేడి

    రాజ్ కౌశల్ పరిస్థితి గమనించిన మందిరాబేడి వెంటనే అప్రమత్తమైంది. తన స్నేహితుడు ఆశీష్ చౌదరీకి ఫోన్ చేయగానే అతడు వెంటనే మందిరా బేడి ఇంటికి చేరుకొన్నారు. అప్పటికే శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది, నొప్పి మరింత కావడంతో కారులో లీలావతి హాస్పిటల్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు.

    10 నిమిషాల్లోనే అపస్మారక స్థితిలోకి

    10 నిమిషాల్లోనే అపస్మారక స్థితిలోకి

    రాజ్ కౌశల్‌ను కారులోకి ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే ఆయన పల్స్ రేట్ పడిపోయింది. హాస్పిటల్‌కు చేరుకొనే లోపే ఆయన మరణించారు. అప్పటికే జరుగాల్సింది జరిగిపోయింది అని సులైమాన్ మర్చంట్ తెలిపారు.

    గుండెపోటు రావడం ఇదే..

    గుండెపోటు రావడం ఇదే..

    రాజ్ కౌశల్‌కు గుండెపోటు రావడం ఇది మొదటిసారి కాదు. ఆయన 32 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. దాంతో ఆయన ఆరోగ్య కుదట పడింది. కానీ ఇలా అకస్మాత్తుగా ఆయన మరణించడం చాలా బాధగా ఉంది అని సులైమాన్ పేర్కొన్నారు.

    English summary
    Bollywood Music Director Sulaiman Merchant about Mandira Bedi's husband and filmmaker Raj Kaushal death. He opened up about what happened a few hours before Raj's demise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X