RajKundra కేసులోకి మనోజ్ బాజ్ పేయిని లాగిన కమెడియన్.. గదిలో బంధించి 100 రోజులు కొట్టాలంటూ!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్ట్ పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. పోర్న్ సినిమాలు చేసి యాప్స్‌లో ప్రచురించినందుకు రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది. బాలీవుడ్‌లో ఈ వార్త వెలువడిన తర్వాత అందరూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంలో మనోజ్ బాజ్ పేయిని లాగుతూ లీడింగ్ కమెడియన్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

మనోజ్ బాజ్‌పేయిపై ఫైర్

మనోజ్ బాజ్‌పేయిపై ఫైర్

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హాస్యనటుడు సునీల్ పాల్ కూడా బాలీవుడ్ ప్రముఖుల పై మాటల దాడి చేశారు. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లో భాగమైన ప్రముఖులపై. ఇక ఆయన కామెంట్ చేసిన జాబితాలో మనోజ్ బాజ్‌పేయి అగ్రస్థానంలో ఉన్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండు సీజన్ల గురించి ప్రస్తావిస్తూ సునీల్ పాల్ మనోజ్ బాజ్‌పేయిపై విరుచుకుపడ్డాడు.

వాళ్ళు అలా వాడుతున్నారు

వాళ్ళు అలా వాడుతున్నారు

సునీల్ పాల్ ప్రకారం, ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సాధారణ కుటుంబాలపై చెడు ప్రభావాన్ని చూపిందని ఆయన అన్నారు. పెద్ద వ్యక్తులు సెన్సార్షిప్ లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్న సునీల్ వెబ్ సిరీస్‌లో లేదా మరెక్కడైనా కావచ్చని అన్నారు. మనోజ్ బాజ్‌పేయి లాంటి 3-4 మందిని నేను నిజంగా ద్వేషిస్తున్నానని ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

అలంటి వ్యక్తిని చూడలేదు

అలంటి వ్యక్తిని చూడలేదు

సునీల్ పాల్ మాట్లాడుతూ, 'ఏమి జరిగిందో(రాజ్ కుంద్రా అరెస్ట్) అది జరగాలి, ఇది అవసరం అని అన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సెన్సార్‌షిప్ లేకపోవడాన్ని పెద్ద వ్యక్తులు సద్వినియోగం చేసుకుంటున్నందున నేను ఈ మాట చెప్తున్నాను. వారు అశ్లీల దృశ్యాలు మరియు అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తున్నారు. మనోజ్ బాజ్‌పేయి ఎంత గొప్ప నటుడు అయినా, ఇంతకంటే అనాలోచిత, అణగారిన వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదని అన్నారు.

Recommended Video

Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
ఏమిటా ఎఫైర్లు

ఏమిటా ఎఫైర్లు

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ ఈ సిరీస్ లో ఒక భార్య మరొక వ్యక్తితో ఎఫైర్ కలిగి ఉంటుందని, భర్తకి వేరే చోట ఎఫైర్ ఉంది, మైనర్ కుమార్తె తన ప్రియుడితో మాట్లాడుతోందని, కొడుకు తన వయస్సు కంటే పెద్ద వాడిలా ప్రవర్తిస్తున్నాడని అన్నారు. కుటుంబం ఎలా ఉంటుంది? ఇప్పుడు వారు లోనావాలాలో ఏమి జరిగిందనే ప్రశ్నని ప్రజలకే విడిచిపెట్టారని అన్నారు.

 అలాంటి వారిని కొట్టాలి

అలాంటి వారిని కొట్టాలి

అసలు ఏం జరుగుతుంది? మీరు చూపించడానికి ఏమి మిగిలి ఉంది? అని ఆయన ప్రశ్నించారు. ఇక మీర్జాపూర్ సిరీస్ గురించిన ఆయన ఈ సిరీస్ లో కూడా ప్రతిదీ విడమరిచి చూపబడిందని అన్నారు. పెద్దల పోర్న్ సినిమా రాకెట్టును ఛేదించిన పోలీసులను సునీల్ పాల్ అభినందించారు. పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల యజమానులు మలినాలను వ్యాపిస్తున్నారని ఆరోపించిన ఆయన, అలాంటి వారిని ఒక గదిలో బంధించి 100 రోజులు కొట్టాలని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X