స్టార్ హీరో కూతురితో క్రికెటర్ కెఎల్.రాహుల్ రిలేషన్.. మీడియా ముందు అలా కవర్ చేసిన తండ్రి!
క్రికెట్ ఆటకు, బాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్న సంబంధం ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆల్ మోస్ట్ ఒకే ఫీల్డ్ అన్నట్లుగా సెలబ్రెటీలు పార్టీలకు వెళుతుంటారు. ఇక ఫామ్ లో ఉండే స్టార్ క్రికెటర్లు హీరోయిన్స్ తో నడిపే లవ్ స్టోరీల గురించి అందరికి తెలిసిందే. ఇక చాలా కాలం అనంతరం టీమిండియా క్రికెటర్ కెఎల్.రాహుల్ కూడా అదే తరహాలో లవ్ యాంగిల్ ను కొనసాగిస్తున్నట్లుగా టాక్ వస్తోంది. ఇక ఆ బ్యూటీ సీనియర్ హీరో కూతురు కావడం విశేషం.

గత రెండు దశాబ్దాలుగా
క్రికెటర్లతో హీరోయిన్స్ చాలా వరకు ఫ్రెండ్లిగానే ఉంటారు. ప్రయివేట్ యాడ్స్ ద్వారా ఒకటయ్యే సెలబ్రెటీల వ్యవహారం ఒక్కోసారిగా స్నేహం నుంచి పెళ్లి వరకు వెళుతుంది. గత రెండు దశాబ్దాలుగా ప్రముఖ స్టార్ క్రికెటర్స్ కొందరు బాలీవుడ్ బ్యూటీలతో రిలేషన్ మెయింటైన్ చేసినవారే.

ప్లే బాయ్ తరహాలో
ఇక ప్రస్తుతం క్రికెటర్ కెఎల్.రాహుల్ కూడా ప్లే బాయ్ తరహాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇదివరకే ఇద్దరి హీరోయిన్స్ తో అతడు లవ్ ట్రాక్ ను కొనసాగించినట్లు టాక్ అయితే వచ్చింది. కానీ ఆ రిలేషన్షిప్స్ ఎక్కువ కాలం కొనసాగలేదు. రాహుల్ కూడా ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోలేదు.

సునీల్ శెట్టి కూతురితో
ఇక చాలా కాలం తరువాత ఈ క్రికెటర్ ఒక స్టార్ హీరో కూతురితో ప్రేమలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు. ఒకప్పటి యాక్షన్ హీరో సునీల్ శెట్టి గారాల కూతురు అతియా శెట్టి. ప్రస్తుతం అమ్మడు హీరోయిన్ గా కూడా క్రేజ్ గట్టిగానే అందుకుంటోంది. అంతే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు సంబంధించిన యాడ్స్ లలో కూడా పాల్గొంటోంది.

సున్నితంగా స్పందించిన సునీల్ శెట్టి
ఇక ప్రస్తుతం రాహుల్ టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాడ్ కు వెళ్లగా తనతో పాటు అతియా శెట్టిని కూడా తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అలాగే వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వచ్చాయి. ఇక ఆ విషయంపై సునీల్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎదుర్కొన్నాడు. ఆయన చాలా సున్నితంగా స్పందించడం విశేషం.

అది వాళ్లనే అడిగితే బావుంటుంది..
సునీల్ శెట్టి స్పందిస్తూ.. అతియా శెట్టి ఇంగ్లాండ్ కు వెళ్లిన మాట వాస్తవమే. ఆమె తన సోదరుడు ఆహాన్ తో కలిసి ట్రిప్ కు వెళ్లింది. రీసెంట్ గా అతియా, రాహుల్ ఇద్దరు కూడా 'నుమి ప్యారిస్' అనే బ్రాండ్ యాడ్ లో నటించారు. వారిద్దరూ బ్రాండ్ అంబాసిడర్స్ గా సెలెక్ట్ అవ్వడం చాలా బావుంది. మంచి జోడి. ఇక రిలేషన్ ఎలా ఉందనే విషయాన్ని డైరెక్ట్ గా వాళ్ళను ఆడిగితేనే బావుంటుంది.. అని సునీల్ శెట్టి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











