స్టార్ హీరోకు అక్రమ సంబంధం... భార్య దిమ్మతిరిగే వార్నింగ్
చిత్ర పరిశ్రమలో నటీనటులు ప్రేమలో పడటం, విడిపోవడం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు.. పెళ్లయినా వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు, పెళ్లి చేసుకోకుండా ఒకేసారి ఇద్దరు ముగ్గురు అందగత్తెలతో డేటింగ్ చేసినవారు కూడా ఉన్నారు. ఈ విషయంలో హీరోయిన్లు కూడా తక్కువేం తినలేదు. అయితే ఒక వయసు, ఒక స్థాయి, ఇమేజ్ వచ్చిన తర్వాత నటీనటులు మారాలి.. కోట్లాది మంది దైవంలా పూజించేవాళ్లు కూడా ఇలాంటి తప్పులు చేయడం మంచిది కాదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ హీరో ఏకంగా 63 ఏళ్ల వయసులో అమ్మాయిలతో ఎఫైర్లు నడుపుతూ విమర్శల పాలవుతున్నాడు. అతనితో ఇన్నేళ్లుగా కాపురం చేసిన భార్య.. తాజాగా సదరు నటుడికి లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఫ్యామిలీ హీరోగా ఇమేజ్
హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సీనియర్ నటుడు గోవిందా. విభిన్నమైన కథలు, కామెడీ చిత్రాలతో మహిళలు, కుటుంబ ప్రేక్షకులను అలరించారు గోవిందా. 1980, 90వ దశకాలలో గోవిందా హవా బాగా సాగింది. 1987లో సునీతా అహుజాను పెళ్లి చేసుకున్నారు గోవిందా. ఈ దంపతులకు యశ్ వర్ధన్ అహుజా, టినా అహుజా సంతానం. అవకాశాలు తగ్గుతున్న దశలో బుల్లితెరపైనా, రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించిన గోవిందా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు.

గోవింద- సునీతల మధ్య మనస్పర్ధలు
పెళ్లయి 39 ఏళ్లు కావొస్తుండగా.. సునీత- గోవిందా మధ్య అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చేవి. అయితే గడిచిన కొన్ని నెలల నుంచి వీరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. వీరు విడాకులు తీసుకున్నారని.. విడివిడిగా ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక గతేడాది డిసెంబర్‌లో విడాకుల కోసం సునీత దరఖాస్తు చేయడం.. భర్తపై వేధింపులు, వ్యభిచారం, క్రూరత్వం, విడిచిపెట్టడం వంటి అభియోగాలు మోపడంతో బాలీవుడ్ వర్గాలు, గోవిందా అభిమానులు ఉలిక్కిపడ్డారు. దాంతో వీరిద్దరూ విడిపోయినట్లేనని అంతా భావించారు. కానీ సడెన్‌గా ఇద్దరు కలిసి కనిపించడం... తాము విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా సునీత ఉన్నట్లుండి బాంబు పేల్చారు.
మీరేం అమాయకులు కాదు
మిస్ మాలిని పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సునీత మాట్లాడుతూ.... తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఎంతోమంది అమ్మాయిలు మిమ్మల్ని కలవడానికి వస్తారు. మీరేం అమాయకులు కాదు.. 63 ఏళ్ల వయసు వచ్చింది.. టీనాకి పెళ్లి చేయాలి, యశ్ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. నిన్ను క్షమించేది లేదు. నేను నేపాల్ అమ్మాయిని.. నేను కత్తిని బయటకు తీస్తే ఇబ్బందులు పడాలి.. అసలు గోవిందా అన్న పేరులోనే తప్పుంది.. అందుకే అతని చుట్టూ ఇంతమంది గోపికలు ఉన్నారు. జాగ్రత్త అంటూ సునీత వార్నింగ్ ఇచ్చారు.
డబ్బు కోసమే గోవిందాతో
అయితే గోవిందాకు అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని సునీత గతంలోనూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత. అతనికి ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, ఆ అమ్మాయి సినీ పరిశ్రము చెందినది కాదని.. కేవలం డబ్బు కోసమే గోవిందాతో ఉంటోందని సునీత ఆరోపించారు. తాజాగా మరోసారి భర్తకున్న వివాహేతర సంబంధాల గురించి సునీత బయటపెట్టడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ప్రస్తుతం సునీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై గోవిందా ఎలా స్పందిస్తారో చూడాలి. నిజంగానే గోవిందాకు అమ్మాయిలతో ఎఫైర్లు ఉన్నాయా? వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారా? అనే దానికి త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











