Divorce: గోవిందా డైవోర్స్ వ్యవహారంలో ట్విస్ట్.. ఆ హీరోయిన్‌పై భార్య ఘాటైన కామెంట్స్!

బాలీవుడ్‌లో అగ్ర నటుడు గోవిందా, ఆయన సతీమణి డైవోర్స్ తీసుకో బోతున్నామనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వారి మధ్య కలహాలు, వ్యక్తిగత విభేదాలపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. అయితే వారిపై ఇద్దరు కూడా మౌనం వహించారు. అయితే తాజాగా గోవిందా సతీమణి తమ విడాకుల వార్తలపై మీడియాలో ఘాటుగా స్పందించారు. తమ మధ్య విడాకులకు ఓ హీరోయిన్ కారణమని వస్తున్న వార్తలపై మరింత ఫైర్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే.

గోవిందా, ఆయన భార్య సతీమణి సునీత అహుజా విడాకులు తీసుకొంటున్నారు. 37 ఏళ్ల వారి దాంపత్య జీవితం విఫలం కాబోతున్నది. వారి డైవోర్స్ కారణం ఓ మరాఠీ నటి. ఆ హీరోయిన్‌తో గోవిందాకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే వారి దాంపత్య జీవితంలో కలతలు చోటు చేసుకొన్నాయి. ఇప్పటికే ఆయనకు ఆమె లీగల్ నోటీసులు జారీ చేసింది అనే వార్తలు జాతీయ మీడియాలో గుప్పుమన్నాయి.

Sunitha Ahuja opens up on Divorce with Govinda

గోవిందా, సునీత డైవోర్స్ వార్తలపై ఆయన గానీ, ఆయన భార్య గానీ స్పందించలేదు. కానీ వారి కుటుంబ సభ్యులు మీడియాలో స్పందించారు. అలాంటి పరిస్థితులు వారి మధ్య లేవు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. వారి పిల్లల కెరీర్‌పై దృష్టిపెట్టారు అని ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు.

నా భర్త గోవిందా, నేను వేర్వేరుగా ఉంటామని చెప్పింది నిజమే. కానీ ఆయన పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన కోసం కార్యకర్తలు భారీగా వస్తుంటారు. దాంతో ఒకే ఇంట్లో ఉంటే ఫ్యామిలీకి ఇబ్బందిగా ఉంటుంది. అలాగే నా కూతురు పెద్దదైంది. నా బిడ్డ యుక్త వయసుకు వచ్చింది. ఇంట్లో షార్ట్స్ వేసుకొని ఉండటం కల్చర్. కాబట్టి మేము స్వేచ్ఛగా ఉండలేమని నిర్ణయానికి వచ్చాం. అందుకే ఇంటికి సమీపంలో వేరే బంగ్లాను తీసుకొని గోవిందా కోసం ఆఫీస్ తీసుకొన్నాం అని సునీతా అహుజా తెలిపారు.

కార్యకర్తలు, పార్టీ వ్యవహారాల కోసం మేము కొత్తగా తీసుకొన్న ఆఫీస్‌లోనే గోవిందా ఉండేందుకు ఏర్పాట్లు చేశాం. ఆయన కార్యకర్తలను కలుస్తూ, సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తూ అక్కడే బిజీగా ఉండిపోయారు. అంతా మాత్రాన ఆయనతో విడిపోయినట్టు కాదు. మేము విడాకులు తీసుకొంటున్నామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ కామెంట్ చేశారు.

అయితే ఓ మరాఠీ హీరోయిన్ తమ కాపురంలో చిచ్చు పెట్టిందనే వార్తలపై గోవిందా భార్య ఘాటుగా స్పందించింది. మా సంసారంలో చిచ్చు పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా? మమల్ని ఎవరూ, ఏ శక్తి కూడా విడదీయలేదు. అలాంటి శక్తి ఏదైనా ఉంటే నా ముందుకు రమ్మని చెప్పండి. వారి సంగతి నేను చూసుకొంటాను అని గోవిందా సతీమణి షాకింగ్ కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Read more about: govinda divorce
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X