Ameesha Patel: పవిత్ర స్థలంలో హీరోతో అలాంటి పని.. వివాదంలో బద్రి హీరోయిన్!
ఆదిపురుష్ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా తిరుమల వెంకన్నని కృతి సనన్, ఓం రౌత్ దర్శనం చేసుకున్నారు. అనంతరం కృతి సనన్ కి వీడ్కోలు చెబుతూ ఓం రౌత్ ఆమెని కౌగిలించుకొని చెక్కిళ్ళపై ముద్దు పెట్టాడు. ఈ ఘటన నేషనల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది. అలాగే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి పనులేంటి అని హిందుత్వ సంఘాలు తీవ్ర విమర్శలు చేశాయి.
హిందుత్వ వాదులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక ఓం రౌత్ ఇలా ముద్దు పెట్టుకోవడాన్ని ఒకప్పటి రామాయణం సీరియల్ లో సీతగా నటించిన నటి కూడా విమర్శలు చేశారు. అసలు ఈ జెనరేషన్ లో పాత్రల ఔచిత్యం కూడా అర్ధంచేసుకోలేకపోతున్నారు అంటూ విమర్శలు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగానే ఇప్పుడు అలాంటి ఘటన సిక్కుల పవిత్ర స్థలంలో జరిగింది.

పంజాబ్ లోని సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలు గద్దర్ 2 చిత్ర బృందం తెరకెక్కించింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ ఈ మూవీలో హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వారిద్దరి మధ్య రొమాంటిక్, ముద్దు సన్నివేశాలని గురుద్వార్ లో చిత్రీకరించారు. దీనిపై గురుద్వార్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భైశాఖి పండుగ ప్రాముఖ్యతని తెలియజేసే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని చిత్ర యూనిట్ పర్మిశం అడిగింది.
అలాగే భగవంతుడిని ప్రార్ధించే దృశ్యాలు చిత్రీకరిస్తామని అన్నారు. అయితే దానికి విరుద్ధంగా రొమాంటిక్ సన్నివేశాలని చిత్రీకరించి గురుద్వారా పవిత్రతకి భంగం కలిగించారు అంటూ నిర్వాహకులు తెలిపారు. శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ చేసిన ఈ దృశ్యాల చిత్రీకరపై వారు సమాధానం చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇప్పుడు ఈ రెండు ఘటనలు బాలీవుడ్ చిత్రపరిశ్రమపై మరోసారి మత విశ్వాసులు విమర్శలు చేయడానికి కారణం అయ్యాయి. మరి గురుద్వార్ లో రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణపై చిత్ర దర్శక, నిర్మాతలు ఏం సమాధానం చెబుతారు అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











