691 కోట్ల సినిమాకు తెలుగు ప్రేక్షకులు షాక్.. డిజాస్టర్ మూవీల కంటే దారుణంగా!
ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా ఇండస్ట్రీల్లోని సీనియర్ హీరోలు ఈ మధ్య కాలంలో భారీ హిట్లను అందుకుంటూ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. తద్వారా తమలోని సత్తా ఇంకా డౌన్ అవలేదని నిరూపిస్తున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ఒకరు. చాలా కాలంగా సక్సెస్ చూడలేకపోతోన్న ఆయన గత ఏడాది 'గదర్ 2' అనే మూవీతో ఆడియెన్స్‌ను పలకరించారు.
సన్నీ డియోల్ నటించిన పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఈ మూవీకి ఆరంభంలోనే హైప్ భారీగా ఏర్పడింది. దీంతో ఈ చిత్రం ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే పాజిటివ్ మౌత్ టాక్‌ను అందుకుని భారీ ఓపెనింగ్స్ సాధించింది.

సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం దాదాపు 50 రోజుల పాటు థియేటర్లలో సందడి చేసింది. ఇలా ఫుల్ రన్‌లో ఈ చిత్రం రూ. 525.70 కోట్లు నెట్ వసూళ్లతో పాటు రూ. 691 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. తద్వారా సన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ఇది రికార్డు సాధించింది.
సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' సినిమాకు థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంపైన కూడా మంచి స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిత్రం తెలుగు వెర్షన్ జీ తెలుగు చానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అయితే, ఊహించని విధంగా ఇక్కడి ప్రేక్షకులను ఈ సంచలన సినిమాకు కోలుకోలేని షాక్‌ను ఇచ్చారు.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'గదర్ 2' చిత్రానికి ఇటీవలే జీ తెలుగులో ప్రదర్శితం అయిన సమయంలో అర్బన్ ఏరియాలో 1.77 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 1.31 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. తద్వారా బాలీవుడ్ హిస్టరీలో తెలుగులో చాలా తక్కువ రేటింగ్ సాధించిన చిత్రంగా 'గదర్ 2' నిలిచింది.

ఇదిలా ఉండగా.. విభిన్నమైన యాక్షన్‌తో రూపొందిన 'గదర్ 2' సినిమాలో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











