నీ పిల్లలను కూడా అందులో దింపుతావా? ట్రోల్స్‌కు కౌంటర్ ఇచ్చిన సన్నీ లియోన్!
సన్నీ లియోన్ ఒకప్పుడు పోర్న్ స్టార్ అయినప్పటికీ ఇప్పుడు ఆ వృత్తిని వదిలేసి... ఇండియన్ ఎంటర్టెన్మెంట్స్ రంగంలో నటిగా రాణిస్తోంది. అయితే కొందరు ఆమె గతాన్ని గుర్తు చేస్తూ ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.
ఇటీవల అర్భాజ్ ఖాన్ చాట్ షోలో పాల్గొన్న సన్నీ లియోన్ తనను ట్రోల్ చేస్తూ వచ్చిన ఓ కామెంటుపై రియాక్ట్ అయ్యారు. ''చాలా మంది అన్ని ప్రయత్నాలు చేసి చివరకు ఫ్యామిలీ బిజినెస్‌లోకి ఎంటరవుతారు. సన్నీ లియోన్ ఎప్పటికైనా తన పిల్లలకు అదే కెరీర్లోకి దింపుతుందా?' అనే కామెంటుపై స్పందించారు.

నేను ఎందుకు అలా చేస్తాను?
తనపై వ్యగ్యంగా ఇలాంటి ట్రోల్స్ చేసిన వారి నోరు హుందాగా మూమించే ప్రయత్నం చేంది సన్నీ. ‘‘నేను ఎందుకు అలా చేస్తాను? కానీ, వారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అవుతానంటే.. దాన్ని ఎంతో గొప్పగా భావిస్తాను. లేదా ఇటీవల లాంచ్ చేసిన కాస్మొటిక్ వ్యాపారాన్ని నా కూతురు కంటిన్యూ చేస్తానంటే తప్పకుండా... అది గ్రేట్ ఫ్యామిలీ బిజినెస్ అవుతుంది. గత రెండేళ్లుగా నేను రన్ చేస్తున్న పెర్ఫ్యూమ్ బిజినెస్ కంటిన్యూ చేసినా అది గొప్ప వ్యాపారమే అవుతుంది'' అని తెలిపారు.

పెద్దయ్యాక ఏం చేయాలనేది వారి ఇష్టం
‘నా పిల్లలను మంచి హ్యూమన్ బీయింగ్‌గా పెంచాలనేది నా గోల్. పెద్దయిన తర్వాత వారు ఎంటర్టెన్మెంట్ రంగంలోకి వచ్చినా లేదా.. జానిటర్(కాపలాదారు), లాయర్, డాక్టర్, అస్ట్రోనాట్, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కావాలనుకున్నా, ఏదైనా కళారంగంలోకి వెళ్లాలనుకున్నా అది వారి ఇష్టం.'' అని సన్నీ లియోన్ స్పష్టం చేశారు.

పోర్న్ ఇండస్ట్రీలోకి వెళ్లడంపై
ఈ సందర్భంగా సన్నీ లియోన్ తాను ఒకప్పుడు పని చేసిన అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి రియాక్ట్ అయ్యారు. ‘అది అలా జరిగిపోయింది. కావాలని వచ్చింది కాదు. అదే సమయంలో ఎవరూ నన్ను ఫోర్స్ చేసి అందులోకి పంపలేదు. అనుకోకుండా ఆ రంగంలోకి వెళ్లాను' అని తెలిపారు.

అప్పుడు అది కరెక్ట్ అనిపించింది
‘ఆ సమయంలో అప్పటి పరిస్థితులు నాకు పోర్న్ స్టార్ అవ్వడం కరెక్ట్ అనిపించింది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో తమకు కరెక్ట్ అనిపించే నిర్ణయాలు తీసుకుంటారు. నేను కూడా అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాను' అని సన్నీ లియోన్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











