భర్తతో రొమాన్స్.. మా ఆయనలా ఎవరూ ముద్దు పెట్టలేరు.. సన్నీలియోన్!

తక్కువ సమయంలోనే సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. అశ్లీల చిత్రాలకు ముగింపు పలికిన సన్నీలియోన్ 2012లో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఐటెం సాంగ్స్, రొమాంటిక్ పాత్రలతో యువతని ఫిదా చేసింది. దీనితో సన్నీలియోన్ కు అవకాశాలు బాగా పెరిగాయి. సన్నీలియోన్ జీవిత చరిత్రపై కరంజీత్ కౌర్ అనే వెబ్ సిరీస్ కూడా ఇటీవల ప్రసారం అయింది. ఆ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్ అశ్లీల చిత్రాల నటిగా ఎలా మారింది, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలని చూపించారు. సన్నీలియోన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సన్నీలియోన్ టాప్‌లో

సన్నీలియోన్ టాప్‌లో

సన్నీలియోన్ బాలీవడ్ బడా సెలెబ్రిటీలని సైతం పక్కకు నెట్టి గూగుల్ సెర్చ్ లో ప్రతి సంవత్సరం టాప్ లో నిలుస్తోంది. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు.. కుర్రకారులో సన్నీలియోన్ కు ఉన్న క్రేజ్ ఏంటో అని. తన అందంతో యువతని సన్నీలియోన్ ఫిదా చేస్తోంది. బాలీవుడ్ లోకి వచ్చాక సన్నిలియోన్ ఐటమ్ సాంగ్స్, రొమాంటిక్ చిత్రాలతో దూసుకుపోతోంది. దక్షిణాదిలో కూడా సన్నీలియోన్ కు అవకాశాలు దక్కుతున్నాయి.

రొమాన్స్ ఎవరితో

రొమాన్స్ ఎవరితో

ఆన్ స్క్రీన్ లో ఎవరితో రొమాన్స్ చేయడం సరదాగా ఉంటుందంటే ప్రశ్నకు సన్నీలియోన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నా భర్త డానియెల్ వెబర్ లాగా ఇంకెవరూ నన్ను ముద్దు పెట్టుకోలేరు అంటూ సన్నిలియోన్ రొమాంటిక్ కామెంట్స్ చేసింది. తనని తన భర్త ఇంట్లో బూబ్ల అని ముద్దుగా పిలిస్తాడని సన్నీలియోన్ తెలిపింది.

 రొమాంటిక్ పాత్రలు

రొమాంటిక్ పాత్రలు

సన్నీలియోన్ ప్రస్తుతం రొమాంటిక్ పాత్రలే కాకుండా కొన్ని కీలక పాత్రలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంటోంది. తమిళంలో సన్నిలియోన్ ప్రధాన పాత్రలో వీరమహాదేవి అనే చారిత్రాత్మక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన కరంజీత్ అనే వెబ్ సిరీస్ లో సన్నీలియోన్ స్వయంగా నటించింది.

గతం గురించి

గతం గురించి

సన్నిలీయోన్ కు పలు సందర్భాల్లో తన గత జీవితం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అశ్లీల చిత్రాల నటి అంటూ చాలా మంది ఇప్పటికి కామెంట్ చేస్తున్నారని సన్నీలియోన్ ఇటీవల ఓ సందర్భంలో ఎమోషనల్ అయింది కూడా. నా గత జీవితాన్ని చెరిపివేయలేను. కానీ అన్ని మరచిపోయి నటిగా స్థిరపడ్డా. ఇప్పటికి అలాంటి కామెంట్లే చేయడం తగదు అని అర్భాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పించ్ అనే షోలో వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X