పాత జీవితాన్ని గుర్తు చేసేలా, అసభ్యకరమైన కామెంట్.. భోరున విలపించిన సన్నీలియోన్!

Recommended Video

Sunny Leone Cried Profusely On A Show Over A Comment | Filmibeat Telugu

శృంగార తార సన్నీలియోన్ తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది. ఐటెం సాంగ్స్, గ్లామర్ రోల్స్‌తో సన్నీలియోన్ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అశ్లీల చిత్రాలకు ముగింపు పలికి ప్రస్తుతం సన్నీలియోన్ నటిగా దూసుకుపోతోంది. సౌత్ లో కూడా సన్నీలియోన్‌కు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల సన్నీలియోన్ బాలీవుడ్ నటుడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పిక్ షోకు అతిథిగా హాజరైంది. ఈ షోలో అర్భాజ్ ఖాన్ అడిగిన ఓ ప్రశ్నకు సన్నీలియోన్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది.

బాలీవుడ్‌లోకి ప్రవేశించినప్పుడు

బాలీవుడ్‌లోకి ప్రవేశించినప్పుడు

సన్నీలియోన్ 2012లో హిందీ చిత్రాల్లో నటిగా తన ప్రయాణం మొదలు పెట్టింది. ఆ సమయంలో మీడియాతో పాటు చాలా మంది ఆమె బ్యాగ్రౌండ్ గురించి ప్రశ్నించారు. తాను శృంగార చిత్రాల్లో నటించింది వాస్తవమే అని, అదంతా పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించానని సన్నీలియోన్ చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. ఓపిగ్గా భరిస్తూనే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. సన్నీలియోన్ గత జీవితం గురించి ప్రశ్నల పరంపర ఇప్పుడు కాస్త తగ్గింది.

పింక్ షోలో అతిథిగా

పింక్ షోలో అతిథిగా

అర్భాజ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పింక్ షోకు సన్నీలియోన్ ఇటీవల అతిథిగా హాజరైంది. అర్భాజ్ ఖాన్, సన్నీ లియోన్ కలసి తేరా ఇంతజార్ చిత్రంలో నటించారు. ఈ షోలో అర్భాజ్ ఖాన్ సోషల్ మీడియాలో నటులపై వచ్చిన ట్రోలింగ్ గురించి వారి స్పందన తెలుసుకుంటాడు. ఓ నెటిజన్ సన్నీలియోన్ గురించి చేసిన కామెంట్ ని ప్రస్తావించాడు. ఆ కామెంట్ చాలా అసభ్యంగా ఉండడంతో సన్నీలియోన్ భోరున ఏడ్చేసింది. అర్భాజ్ ఖాన్ సముదాయించడానికి ప్రయత్నించినా సన్నీలియోన్ ఏడుపు ఆగలేదు.

పాత జీవితాన్ని

పాత జీవితాన్ని

అందరూ నా గత జీవితాన్నే ఎందుకు గుర్తు చేస్తున్నారు అని సన్నీలియోన్ తెలిపింది. మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను. కానీ ఇలా మానసిక వేదన కలిగిచే ప్రశ్నలు అడగడం అవసరమా అని సన్నీలియోన్ ప్రశ్నించింది. గతంలో నా జీవితంలో జరిగిన అన్ని అంశాలని మరచిపోయి నటిగా రాణిస్తున్నానని సన్నీలియోన్ తెలిపింది.

నేను క్రియేట్ చేయడం లేదు

నేను క్రియేట్ చేయడం లేదు

సన్నీలియోన్ కు అర్భాజ్ ఖాన్ వివరణ ఇచ్చాడు. ఈ షో ముఖ్య ఉద్దేశమే ఇది అని తెలిపాడు. సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ కామెంట్స్, విమర్శలపై సెలెబ్రిటీల రెస్పాన్స్ తెలుసుకోవడమే ఈ షోలో జరుగుతుంది. ఇక్కడ నేనేమి క్రియేట్ చేయడం లేదు. ఉన్న కామెంట్స్‌నే ప్రస్తావిస్తున్నాను అని తెలిపాడు. ప్రస్తుతం సన్నీలియోన్ వీరమహాదేవి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X