స్టింగ్ ఆపరేషన్‌లో బుక్కైపోయిన సన్నీలియోన్, సోనూసూద్.. నిజం ఒప్పేసుకున్నాడు!

మరికొన్ని నెలల్లోనే దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఏస్థాయిలో డబ్బు ఖర్చు చేస్తాయో అందరికి తెలుసు. ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ తారలు రాజకీయ పార్టీల చేతుల్లో ఎలా కీలు బొమ్మగా మారారో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో సన్నీ లియోన్, సోను సూద్, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్ సెలెబ్రటీల పేర్లు బయటకు వచ్చాయి. అసలు ఈ స్టింగ్ ఆపరేషన్ దేనిగురించో ఇప్పుడు చూద్దాం!

 బిగ్ డీల్

బిగ్ డీల్

సన్నీలియోన్, సోను సూద్, వివేక్ ఒబెరాయ్, కైలాష్ ఖేర్, జాకీ ష్రాఫ్, టిస్కా చోప్రాతో సహా 30 మంది బాలీవడ్ తారల పేర్లు ఈ స్టింగ్ ఆపరేషన్ లో బయటకు వచ్చాయి. వీరంతా ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధులతో సీక్రెట్ గా సమావేశం అయినట్లు తెలుస్తోంది. తమ పార్టీని సోషల్ మీడియా వేదికగా రాబోవు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రమోట్ చేసేందుకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారు. హాజరైన సెలెబ్రిటీలంతా తమ క్రేజ్ కు తగ్గట్లుగా అమౌంట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒప్పేసుకున్న సోనూసూద్

ఒప్పేసుకున్న సోనూసూద్

స్టింగ్ ఆపరేషన్ గురించి అనేక కథనాలు వెలువడుతుండడంతో సోనూసూద్ స్పందించాడు. మేము చర్చించుకున్న కొన్ని విషయాలని మాత్రమే ఎడిట్ చేసి సంచలనం సృష్టించేందుకు సదరు మీడియా తప్పుదారిపట్టించే విధంగా వార్తలు ప్రచురిస్తోందని సోనూ సూద్ తెలిపారు. ఆ వార్తకు భయంకరమైన బ్యాగ్రౌండ్ స్కోర్ జత చేసి కథనాలు వేస్తున్నారు. ఇది చాలా చిన్న విషయం. సినీ తారలు కార్పొరేట్ సంస్థల బ్రాండ్స్ ని, కంపెనీలని, రాజకీయ పార్టీలని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం చాలా సాధారణ విషయం. దీని కోసం వాళ్ళు తమని కలసి చర్చలు జరుపుతుంటారు.

 విలువలు పాటిస్తా

విలువలు పాటిస్తా

ఇలా కార్పొరేట్ బ్రాండ్స్ ని కానీ, రాజకీయ పార్టీలని కానీ ప్రమోట్ చేసేటప్పుడు నేను కొన్ని విలువలు పాటిస్తా. బాధ్యత వహిస్తా. ఆ వీడియోలో నేను ఏ రాజకీయ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడలేదు. అలాగే వాళ్ళు చేసిన చెడు పనులకు, నిజం కాని విషయాలకు ప్రచారం చేయను. మంచి ఏదైనా ఉంటె దానిని నలుగురికి చెప్పదానికి నేను ఎప్పుడూ ముందుంటాను అని సోనూసూద్ తెలిపారు. కానీ సదరు మీడియా సంస్థ మాత్రం నేనేదో చెడు వ్యక్తిలాగా చిత్రీకరిస్తూ కథనాలు ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్నీలియోన్ స్పందన

సన్నీలియోన్ స్పందన

శృంగార తార సన్నీలియోన్ ఈ వార్తల గురించి ట్విట్టర్ వేదికగా స్పందించింది. నేను ఏదో రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. ఏదైనా రాజకీయ పార్టీకి ప్రచారం కల్పించాలని అనుకుంటే ముందుకు ఆ విషయాన్ని అందరికి ప్రకటిస్తా. చాలా కార్యక్రమాల కోసం వివిధ రకాల వ్యక్తులని, వివిధ సందర్భాల్లో కలుస్తుంటాం. వారు చెప్పే విషయాలని వింటుంటాం. అంత మాత్రాన అన్ని జరిగిపోవు. నేనింతవరకు రాజకీయాల గురించి కానీ, రాజకీయ పార్టీల గురించి కానీ నా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు అని సన్నీ లియోన్ తెలిపింది.

 బయటపడ్డ పేర్లు

బయటపడ్డ పేర్లు

సన్నిలియోన్, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అమీషా పటేల్, టిస్కా చోప్రా, పంకజ్ ధీర్, మనీషాలాంబ, రోహిత్ రాయ్, రాఖి సావంత్ తో పాటు మరికొందరు సెలెబ్రిటీలు ఈ జాబితాలో ఉన్నారు. సోనూసూద్ డీల్ నిజమే అని అంగీకరించగా, సన్నీలియోన్ నిజం కాదంటూ స్పందించింది. మిగిలిన సెలెబ్రిటీలు స్పందించడానికి ఇష్టపడడం లేదు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న సెలెబ్రిటీ చేసే ప్రమోషన్ కు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X