కాల్ చేయమని నెంబర్ చెప్పిన సన్నీ లియోన్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న యువకుడు
సన్నీలియోన్.. పరిచయం అవసరం లేని పేరిది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈమె గురించి తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆమెకు సంబంధించిన ఏ అప్‌డేట్ వచ్చినా దానికి విపరీతంగా రెస్పాన్స్ వస్తుంటుంది. ఒకానొక సందర్భంలో ఆమె ఓ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో జనం ఎలా వచ్చారో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఆమె క్రేజ్‌ను ఉపయోగించుకోడానికి ఫిల్మ్ మేకర్స్ పోటీ పడుతుంటారు.
గతంలో సన్నీ లియోన్ ప్రతి సినిమాకూ ఓకే చెప్పేసేది. అయితే, కొన్నాళ్లుగా ఆమె చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమె ఇటీవల ఓ సినిమాను చేసింది. అదే.. 'అర్జున్ పటియాలా'. సన్నీ లీడ్ రోల్ చేసిన ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సన్నీతో పాటు దిల్జీత్ దొసాన్జ్, వరుణ్ శర్మ, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్‌తో ప్రదర్శితమవుతోంది. అంతా మంచిగానే ఉందనుకుంటున్న సమయంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో సన్నీ లియోన్ ఓ సన్నివేశంలో తనకు కాల్ చేయమని మరో నటుడికి చెబుతుంది. ఆ సమయంలో ఓ ఫోన్ నంబర్ కూడా ఇస్తుంది. దీంతో అది నిజంగానే సన్నీ లియోన్ నెంబర్ అనుకున్న ప్రేక్షకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు. అప్పుడే వాళ్లకు అసలు విషయం తెలిసింది.
సన్నీ చెప్పిన నెంబర్ ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్ అగర్వాల్‌ది. సన్నీ లియోన్ చెప్పడంతో చాలా మంది ఆయనకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తుండడంతో పునీత్ బయటకు వచ్చాడు. చాలా మంది ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు, తనకు ఈ పరిస్థితిని కల్పించిన 'అర్జున్ పటియాలా' యూనిట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను అతడు మీడియాకు వెల్లడించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











