సన్నీ లియోన్ చేసిన పనికి భయంతో చెమటలు పట్టాయి, ఏం జరిగిందంటే?
Recommended Video
సన్నీ లియోన్ ప్రస్తుతం 'కోకాకోలా' అనే హారర్ కామెడీ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని రావురాజ్ విలాస్ కుచేసర్ కోటలో జరుగుతోంది. అయితే షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన యూనిట్ సభ్యులు భయంతో వనికిపోయేలా చేసింది.
ఓ సీన్ చిత్రీకరణలో భాగంగా బాలీవుడ్ నటుడు దేవ్ గిల్... సన్నీ లియోన్‌ను గన్‌తో షూట్ చేశాడు. అది డమ్మీ గన్ అయినప్పటికీ సన్నీ లియోన్ కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఎంత పిలిచినా లేవక పోవడంతో కంగారు పడిపోయిన యూనిట్ సభ్యులు ఆమె పల్స్ రేటు, హార్ట్ బీట్ చెక్ చేయడం మొదలు పెట్టారు.
అందరికీ చెమటలు పట్టాయి
గన్ షాట్ తర్వాత ఆమె గాయపడిందా? అనే అనుమానాలు యూనిట్ సభ్యుల్లో వ్యక్తం అయ్యాయి. జరుగకూడని సంఘటన ఏమైనా జరిగిందా? అనే భయం వారిలో మొదలైంది. ఆమె కింద పడిపోయినపుడు మొదట లైట్ తీసుకున్న చిత్ర బృందం... చాలా సేపు అలా అపస్మారక స్థితిలో ఉండటంతో వారిలో భయంతో చెమటలు పట్టాయి.
అందరినీ సర్ ఫ్రైజ్ చేసిన సన్నీ లియోన్
తనకు ఏదో అయిందని కంగారులో ఉన్న యూనిట్ సభ్యులను సర్‌ప్రైజ్ చేస్తూ సన్నీ లియోన్ పైకి లేశారు. అందరినీ ఆట పట్టించేందుకే ఆమె అలా నటించారట. దీంతో అప్పటి వరకు భయంలో ఉన్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

కోకా కోలా
‘కోకా కోలా' చిత్రానికి ప్రసాద్ తాతికేని దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సింగ్ సంధు, చిరాగ్ దరివాల్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.

బ్రహ్మానందం, సునీల్
ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, సునీల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దెయ్యాలు తిరుగే ఓ బంగ్లా చుట్టూ ‘కోకా కోలా' కథ ఉంటుందని, ఇందులో బ్రహ్మానందం మిడిల్ ఏజ్ రిచ్ మ్యాన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మనందం, సునీల్, సన్నీ లియోన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయిని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











