Don't Miss!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియాంక చోప్రా, దీపికాలను వెనక్కు నెట్టేసి.. వరుసగా రెండో సారి టాప్ ప్లేస్
శృంగార తారగా ఎందరో కుర్రకారు మతి పోగొట్టిన సన్నీ లియోన్.. పోర్ట్ స్టార్‌గా ప్రపంచస్థాయిలో ఫుల్ ఫేమ్‌ను సంపాదించుకుంది. అయితే అక్కడి నుంచి షిఫ్ట్ అయిన సన్నీ.. బాలీవుడ్లో సెటిల్ అయింది. అడపదడపా చిత్రాల్లో నటిస్తూ దక్షిణాది ప్రేక్షకులను కూడా పలకరిస్తోంది. తెలుగులో ఐటెమ్ సాంగ్స్, ప్రత్యేక పాత్రలను పోషిస్తూ ఉన్న సన్నీ లియోన్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతూ ఉంటుంది.
హాట్ ఫోటోలతో హల్ చల్..
అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలను చేస్తూ వస్తున్న సన్నీ లియోన్.. సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్ల మతి పోగొడుతుంది. అందుకే సోషల్ మీడియాలో అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలెబ్రిటీల్లో సన్నీ లియోన్ కూడా ఉంటుంది.
తాజాగా మరోసారి నెంబర్ వన్..
గత రెండు సంవత్సరాలుగా గూగుల్ సెర్చ్‌లో ఈ అమ్మడు కాస్త వెనుకబడినా... యాహూలో మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగుతోంది. ఈ ఏడాదిలో యాహూ సెర్చ్ ఇంజన్లో అత్యధికంగా వెతికిన పేరు సన్నీలియోన్ అంటూ యాహూ సంస్థ ప్రకటించింది.
సల్మాన్ ఖాన్ టాప్..
అలాగే అత్యధిక మంది వెతికిన స్టార్ హీరోగా సల్మాన్ ఖాన్ టాప్‌లో నిల్చోగా.. అమితాబ్, అక్షయ్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. సన్నీ లియోన్ తరువాత ప్రియాంక, దీపికా వంటి వారున్నారని, ఐకాన్ ఆఫ్ ది ఇయర్‌గా హృతిక్ రోషన్, సారా అలీ ఖాన్లు ఎంపికయ్యారని తెలిపింది.
Recommended Video
దశాబ్దపు హిట్స్..
ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రం రెండు వేల కోట్లను కొల్లగొట్టగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది డికేడ్‌గా ఎంపికైనట్లు ప్రకటించింది. ఆపై భజరంగీ భాయీజాన్, పీకే, సుల్తాన్, టైగర్ జిందా హై, ధూమ్3, సంజు, వార్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దబాంగ్ నిలిచాయని తెలిపింది.