భర్తతో హాట్ బ్యూటీ సన్నీలియోన్ వైరల్ పిక్స్: సేఫ్‌గా ఉండేందుకు ముందుజాగ్రత్త అంటూ సూచన
ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. ఎక్కడచూసినా ఈ వైరస్ గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఎవరికివారు ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హాట్ బ్యూటీ సన్నీలియోన్ ఓ సలహా ఇస్తూ వార్తల్లో నిలిచింది. ఇంతకీ సన్నీ సలహా ఏంటి? వివరాల్లోకి పోతే..

వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్.. రంగంలోకి సన్నీలియోన్
ముఖ్యంగా చైనాలో ఈ కరోనా వైరస్ బాగా విస్తరించడంతో ఇప్పటికే వందలాది మంది మరణించారు. వేలాది మంది ఆసుపత్రి పాలయ్యారు. దీంతో అప్రమత్తమైన ప్రపంచ జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చైనాలో వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఏ ఒక్కరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. చైనాతో పాటు పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో సన్నీలియోన్ రంగంలోకి దిగింది.

విమానాశ్రయంలో భర్తతో సన్నీ..
ఓ మనిషి నుంచి మరో మనిషి ఈజీగా అంటుకునే ఈ వైరస్ ప్రభావం చైనాలో మొదలుకొని ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా బాలీవుడ్ నటి, హాట్‌స్టార్ సన్నీలియోన్ ప్రజలకు ముందుజాగ్రత్త చర్యగా మంచి సలహా ఇచ్చారు. బాలీవుడ్ నటి సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా నల్లరంగు మాస్క్‌లు ధరించి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు.

సన్నీలియోన్ విజ్ఞప్తి.. ముందు జాగ్రత్త చర్య
అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చైనాతో పాటు పలు దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న కారణంగా ప్రజలందరూ ఈ వైరస్ బారినుంచి సురక్షితంగా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా మాస్క్‌లు ధరించాలని సన్నీలియోన్ కోరారు. ‘‘కరోనా వైరస్ మిమ్మల్ని ప్రభావితం చేయకుండా సురక్షితంగా ఉండండి'' అంటూ సన్నీలియోన్ విజ్ఞప్తి చేశారు.
సన్నీలియోన్ భర్త డేనియల్ రిక్వెస్ట్
విమానాశ్రయాల్లోనే ఎక్కువగా కరోనావైరస్ దాడి చేసే అవకాశం ఉందని, అందువల్ల ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సన్నీలియోన్ భర్త డేనియల్ కూడా కోరారు. చైనాతోపాటు థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్, అమెరికా, తైవాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మకావ్, సౌత్ కొరియా, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, వియత్నాం, నేపాల్, కంబోడియా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది.
Recommended Video

హడలెత్తిపోతున్న హైదరాబాద్.. వైద్య ఆరోగ్య శాఖ చర్యలు
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని కూడా భయపెడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కరోనా వైరస్ కారణంగా హడలెత్తిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్ ఇటు మన దేశంలోనూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తుండటంతో.. విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులను ఎయిర్‌పోర్ట్‌ల వద్ద వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











