Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సన్నీ లియోన్ నా తల్లి... బీహార్ విద్యార్ధి హంగామా.. షాకైన్ అడల్ట్ స్టార్
సన్నీ లియోన్ నా తల్లి అంటూ కొద్ది రోజుల క్రితం బీహార్ కు చెందిన ఓ డిగ్రీ విద్యార్ధి సోషల్ మీడియాలో హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ వార్తలపై సాక్షాత్తూ సన్నీ లియోన్ రియాక్ట్ అవ్వడంతో మరోసారి ఈ వార్త హెడ్ లైన్స్ కు ఎక్కింది.
బీహార్ కు చెందిన బీఏ విద్యార్ధి తన అడ్మిట్ కార్డ్ లో ఇమ్రాన్ ష్మీని తన తండ్రిగాను, సన్నీ లియోన్ ను తన తల్లి గానూ పేర్కొనడం స్థానికంగా సంచలనం సృష్టించింది. భీమ్ రావ్ అంబేద్కర్ యూనివర్శిటీ నిర్వాహకులు ఈ అడ్మిట్ కార్డ్ ను చూసి షాక్ అవ్వడంతో విషయం బయటకు వచ్చింది. వారే ఈ అడ్మిట్ కార్డ్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొద్ది గంటల్లోనే అది వైరల్ గా మారింది. ఇక ఇమ్రాన్ హష్మీకి , సన్నీలియోన్ కు ముజాఫర్ నగర్ లో పెళ్లి అయిందని, వారు అక్కడే నివాశం ఉంటున్నారని రికార్డుల్లో పేర్కొనడం మరో విశేషం.
దీనిపై వెంటనే స్పందించిన ఇమ్రాన్ హష్మీ నాకేమీ సంబంధం లేదంటూ ట్వీట్ చేశాడు. తాజాగా సన్నీలియోన్ కూడా ఈ వార్తపై స్పందించింది. ఈ కుర్రాడు భలేగా ఉన్నాడు... పెద్ద కలలు కనడం కూడా ఓ కళే అంటూ సరదాగా ట్వీట్ చేసింది. మొత్తానికి ఆ కుర్రాడికి వచ్చిన ఆలోచన నేషనల్ వైడ్ గా వైరల్ గా మారింది.