సన్నీ లియోన్ కూతురు టాలెంట్ చూశారా? ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్
ఇండియాలో అడుగు పెట్టి పాపులర్ స్టార్‌గా ఎదిగిన సన్నీ లియోన్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే. ఇటీవల సన్నీ తన 8వ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంది. తన పిల్లలు, భర్తతో కలిసి జరుపుకున్న ఈ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.
సన్నీ లియోన్ షేర్ చేసిన ఈ ఫోటోల్లో కనిపిస్తున్న కొన్ని మూమెంట్స్ నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి. అంతే కాదు తన కూతురు నిషా గురించి ఆసక్తికర విషయం వెల్లడించింది. మరి ఇంకెందుకు ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం రండి.

ఫన్నీ మూమెంట్స్
ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూశారా... తన వెడ్డింగ్ యానివర్శరీ కేక్ కట్ చేసేముందు క్యాండిల్స్ ఆర్పుతూ సన్నీ లియోన్ ఫన్నీగా దర్శనమిచ్చారు. ఈ ఫోటోపై నెటిజన్లు జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆమె చాలా క్యూట్‌గా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తుండటం గమనార్హం.

అవునా? ఈ కేక్ తయారు చేసింది సన్నీ లియోన్ కూతురేనంట..
సన్నీ లియోన్ షేర్ చేసిన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫోటోల్లో ఆమె కూతురు నిషా కూడా ఉంది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ కేక్ తయారు చేసింది ఆ పాపేనంట. సన్నీ లియోన్ స్వయంగా చెప్పింది కాబట్టి ఈ విషయం నమ్మాల్సిందే. ఈ సందర్బంగా సన్నీ తన భర్త డేనియల్ వెబర్‌ను ఉద్దేశించి ‘నువ్వు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తివి. నా బెస్ట్ ఫ్రెండ్, నా పిల్లలకు బెస్ట్ ఫాదర్' అని పేర్కొంది.

సన్నీ లియోన్-డేనియల్ వెబర్ లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే?
గతంలో ఓ ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ మాట్లాడుతూ.. ‘డేనియల్ బ్యాండ్ మేట్ ద్వారా మేము వెగాస్‌లో కలిశాం. నన్ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. నా ఫోన్ నంబర్ , ఈమెయిల్ తీసుకుని తన ప్రేమను వ్యక్తపరిచే ప్రయత్నం చేశాడు. మళ్లీ మేము అనుకోకుండా న్యూయార్కులో కలిసిన తర్వాత మరింత దగ్గరయ్యాం' అని తెలిపారు.

ఎలా ప్రపోజ్ చేశాడంటే...
నాకు ఎంతో ఇష్టమైన జ్యువెలరీ బాక్స్ ఇచ్చి ప్రపోజ్ చేశాడని సన్నీ లియోన్ గంతలో ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏప్రిల్ 10, 2011లో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరికి నిషా కౌర్ వెబర్ అనే కూతురుతో పాటు నోవా, అషెర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











